6 Transgenders Arrested. (Photo Credits: ANI)

Bhubaneswar, August 9: ఒడిషాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు ట్రాన్స్‌ జెండర్లు ఏకంగా ఓ పోలీసు కానిస్టేబుల్‌పై దాడి (Assaulting Police Constable in Bhubaneswar) చేశారు. ఈ ఘటన ఒడిశాలోని భరత్‌పూర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ట్రాన్స్‌ జెండర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనకు పాల్పడిన నిందితులు.. రిని బెహరా, సాలిని దాస్, లోపా సేథి, దీపాలి నాయక్, సుని జెనాగా పోలీసులు గుర్తించారు. వారి మీద హత్య కేసు న​మోదు (6 Transgenders Arrested) చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వెల్లడించారు. కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారనే కోణంలో ట్రాన్స్‌ జెండర్లపై విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.

చిత్తూరులో విషాదం, టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, నంద్యాలలో యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి దారుణ హత్య

రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. మాట్లాడుకుందామని ఇంటికి ఆహ్వనించి.. మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి ఓ కామాంధుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత యువతి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన బాధిత మహిళ స్థానికంగా ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కోచింగ్‌ సెంటర్‌ను నడుపుతుంది. దీంట్లో ఎందరో విద్యార్థులు కోచింగ్‌ తీసుకుంటున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం, గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు, నిద్రిస్తున్న 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, గుజరాత్‌లోని అమ్రేలీ పరిధిలోని బాధ్డా గ్రామంలో విషాద ఘటన

ఈ క్రమంలో.. నీరజ్‌కుమార్‌ అనే వ్యక్తి.. సదరు ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను తీసుకునేవాడు.కాగా, ఇతను ఉదయ్‌పూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేసేవాడు. అయితే, కోచింగ్‌ సెంటర్‌ లో క్లాసులు తీసుకోవడం వలన వీరిద్దరికి కొంత పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా నీరజ్‌ కోచింగ్‌ సెంటర్‌ యజమానిపై కన్నేశాడు. ఇందులో భాగంగా ఆ యువతిని ఉదయ్‌పూర్‌లోని తన ఇంటికి రావల్సిందిగా ఆహ్వనించాడు. అయితే, బాధిత యువతి తెలిసినవాడే కదా.. అని ఉదయ్‌పూర్‌ వెళ్లింది.

బీహార్‌‌లో ఆటోను ఢీకొన్న ట్రక్కు, ఐదుగురు అక్కడికక్కడే మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు, మరో రాష్ట్రం యూపీలో సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు బాలికలు మృతి

యువతి ఉదయ్‌పూర్‌ వచ్చాక ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చాడు. దాని ప్రభావంతో ఆమె మత్తులోకి జారుకుంది. దీంతో.. అతగాడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి మత్తు నుంచి తేరుకున్నాక.. సదరు యువతి ఆందోళనకు లోనైంది. వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నీరజ్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న గోడుండా పోలీసులు నీరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలుసెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.