Mumbai, January 14: ప్రయాణికులను ఆకర్శించేందుకు రైళ్లలో పలు రకాల సేవలను, వసతులను ఇండియన్ రైల్ క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రవేశపెడుతుంది. అయితే వాటి నాణ్యత విషయంలో మాత్రం సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ ఇస్తే, ఆ వచ్చిన ఫుడ్ రంగు, రుచి మరియు పరిమాణం తక్కువ కానీ, ధర మాత్రం ఎక్కువ అని చాలా మంది ప్రయాణికులు ఇళ్ల నుంచే తమ ఆహారాన్ని తాము తెచ్చుకుంటున్నారు. రైళ్లలో అందించే ఆహరంలో నాణ్యత (Food Quality in Trains) సరిగ్గా లేదని ఇప్పటికే ఎన్నో సార్లు ఫిర్యాదులు వచ్చాయి, అయినప్పటికీ రైల్వేలో టెండర్లు తెసుకునే కాంట్రాక్టర్లు మాత్రం ప్రయాణికుల ఆరోగ్యం ఏమైపోయినా గానీ, తక్కువ క్వాలిటీ ఆహారాన్ని అందించడంలో మాత్రం రాజీపడం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.
తాజాగా, అలాంటి మరో ఘటన వెలుగుచూసింది. ముంబై - గోవా వెళ్లే జన్ శతాబ్ది (JanShatabdi Express) ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు తనకు అందించిన బ్రెడ్ కట్లెట్స్ తాజావి కావు, వాటిపై అంతా ఫంగస్ చేరిందంటూ ఫిర్యాదు చేశాడు. ఆ ఆహారాన్ని ఫోటో తీసి 'Rail Madad' అనే యాప్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై విక్రయదారుడ్ని ప్రశ్నిస్తే డబ్బు వాపస్ చేశాడు, కానీ అతడి వద్ద ఇతర అన్ని రకాల ఆహార పదార్థాల నాణ్యత కూడా సరిగా లేదు దీంతో ఫిర్యాదు చేశానని ప్రయాణికుడు తెలిపాడు.
ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ కాంట్రాక్టర్‌పై మరియు అమ్మిన రైలు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు ఐఆర్‌సిటిసి తెలిపింది. కాంట్రాక్టర్‌కు లక్ష రూపాయల జరిమానాతో పాటు నోటీసులు జారీ చేసినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శివాజీ సుతార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా అన్ని రైల్వే స్టేషన్లలో మరియు రైళ్లలో 'ఫుడ్ క్వాలిటీ రివ్యూ' డ్రైవ్‌ను చేపట్టనున్నట్లు తెలిపారు. రైళ్లలో మీల్స్ మరియు టీ ధరలను పెంచిన ఐఆర్‌సిటిసి, పెరిగిన ధరలు ఇలా!
ఈ నెలలో ఇప్పటివరకు ముంబై నుంచి వెళ్లే రైళ్లలో ఇలాంటి ఘటనలు 3 చోటు చేసుకున్నాయి. జనవరి 7న ముంబై- అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో చెడిపోయిన బ్రేక్ ఫాస్ట్ తిని 36 మంది అస్వస్థతకు గురయ్యారు. జనవరి 11న తేజాస్ ఎక్స్‌ప్రెస్‌లో పాచిపోయిన వెజ్ పులావ్ తిన్న కొంతమంది ప్రయాణీకులు వాంతులు చేసుకున్నారు. ఇప్పుడు పైన పేర్కొన్న ఘటన, ఆమె ఆ ఆహారాన్ని తినకపోవడం, ఆమెను చూసి మిగతా వారు దూరంగా ఉండటంతో బతికిపోయారు.