Rajya Sabha MPs Oath Ceremony: రాజ్యసభ చరిత్రలో తొలిసారి, సమావేశాలు జరగకుండా రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఏపీ నుంచి ముగ్గురు వైఎస్సార్ ‌సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం
Indian Parliament (Photo credits: Wikimedia Commons)

New Delhi, July 22: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 61 మంది సభ్యులు (Rajya Sabha MPs Takes Oath) బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రాజ్యసభ చైర్మన్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారితో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. సమావేశాలు జరగనప్పుడు సభలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగడం రాజ్యసభ (Rajya Sabha) చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు (YSRCP MPs) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీకి భంగపాటు, ఏపీలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ

ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. మరో సభ్యుడు పరిమళ్‌ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు.

మొత్తం 56 మంది ఎంపీలు ప్రమాణం చేయాల్సి ఉండగా కరోనా కారణంగా దాదాపు 12 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరుకావటం లేరని సమాచారం. వారిలో టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కె. కేశవరావు, సురేష్ రెడ్డి ల తో పాటు జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే నేత తిరుచ్చి సహా పలువురు నేతలు ఉన్నారు. వీరు పార్లమెంట్ సెషన్ ప్రారంభమయ్యాకే ప్రమాణం చేయనున్నారు.