Prudhvi Raj Audio Leaked: వెనక నుంచి పట్టుకుందామనుకున్నా, నువ్వే గుర్తుకు వస్తున్నావు, కలకలం రేపుతున్న ఎస్వీబీసీ చైర్మన్ రాసలీలల ఆడియో టేపు, ఆ వాయిస్ తనది కాదంటున్న యాక్టర్ పృథ్వీరాజ్, కఠిన చర్యలు దిశగా ప్రభుత్వం
SVBC chairman Prudhvi Raj (Photo-Facebook)

Tirupati, January 12: ఎస్వీబీసీ చైర్మన్,(SVBC chairman) సినీ నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) ఇప్పటికే పోసానితో(Posani Krishna Murali) వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

పృథ్వీ రాసలీలకు సంబంధించిన ఆడియో టేపులు ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) కలకలం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన సీఐటీయూ(సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) నేతలు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పృథ్వీ రాసలీలల ఆడియోని రిలీజ్ చేశారు.

 

పృథ్వీపై సీఐటీయూ (CITU)రాష్ట్ర అధ్యక్షుడు మురళి తీవ్రంగా మండిపడ్డారు. ఎస్వీబీసీ చైర్మన్ గా ఓ కామాంధుడిని నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను వేధించే వ్యక్తిని చైర్మన్ గా కూర్చోపెట్టారని సీరియస్ అయ్యారు. పృథ్వీ రాజ్ మొదట శ్రీవారికి పరమభక్తుడిగా నటించారని అన్నారు. పృథ్వీ ఎస్వీబీసీ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారని, జీతాలు పెంచుతానంటూ లోబర్చుకుంటున్నారని ఆరోపణలు చేశారు.

ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో కొనసాగే హక్కు పృథ్వీకి లేదన్నారు. అటు ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం సైతం పృథ్వీపై ఆగ్రహంగా ఉంది. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చైర్మన్ పదవిలో పృథ్వీ కొనసాగితే ఎస్వీబీసీకి అప్రతిష్ట అని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 30మంది ఉద్యోగులను ఇష్టానుసారం నియమించారని, డబ్బు వసూలు చేశారని పృథ్వీపై ఆరోపణలు చేశారు.

క్లైమాక్స్‌లో రాజధాని అంశం, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

వీడియో వైరల్ కావడంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ స్పందించారు . తాను ఏ మహిళతో ఫోన్ లో మాట్లాడలేదని..ఆ ఆడియో తనది కాదన్నారు. తనకు ఎవరితో సంబంధాలు లేవన్నారు. ఎవరో కావాలని తనపై దుష్రచారం చేశారని అన్నారు. తాను ఎస్వీబీసీ ఛైర్మన్ కావడం చాలా మందికి ఇష్టం లేదని..అందుకే ఎవరో ఓర్వలేక తనపై ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

ఏపీ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు

ఆ మహిళా ఎవరో తనకు తెలీదన్నారు. అందులో ఉన్న వాయిస్ తనది కాదని..దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు . విచారణతో తాను తప్పు చేసినట్లు రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. తాను మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటానన్నారు. కావాలంటే ఎస్వీబీసీ లో పనిచేసే ఉద్యోగులను అడిగి తెలుసుకోవాలన్నారు. తనను ఎవరో కావాలనే టార్గెట్ చేశారని అన్నారు.

విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

కాగా గతంలో రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతుల్ని పెయిడ్‌ ఆర్టిస్టులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఆందోళనలో పాల్గొన్న వారిలో కొందరు తనతో కలిసి ఆర్టిస్టులుగా పని చేశారని, రైతులు ఎవరైనా ఆడి కార్లలో తిరుగుతారా? బంగారు గాజులు వేసుకుని ధర్నాలు చేస్తారా అంటూ పృథ్వీ విమర్శలు గుప్పించారు. దీనిపై నటుడు పోసాని కృష్ణ మురళీ తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. రైతులకు కార్లు ఉండకూడదా అని ప్రశ్నించారు.

అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ

పొలం పని చేసే మహిళలు బంగారు గాజులు కొనుక్కోకూడదనా అని నిలదీశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు పృథ్వీ సిగ్గు పడాలని.. పృథ్వీకి ఏ మాత్రం నైతిక విలువలున్నా వెంటనే రాజధానిలో మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

దీనిపై పృథ్వీ కూడా రెస్పాండ్ అయ్యారు. నేను రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనలేదన్నారు. రైతుల ముసుగులోని బినామీలను మాత్రమే పెయిడ్ ఆర్టిస్టులు అన్నాను అని చెప్పారు. రాజధానిలో ధర్నా చేస్తున్న వారిలో నాతో పని చేసిన ఆర్టిస్టులు ఉన్నారని పృథ్వీ మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ అలర్ట్ అయింది. రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణిచింది పార్టీ అధిష్టానం. కులాలను ప్రస్తావిస్తూ ఎవరూ మాట్లాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పృథ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.