Tamil Nadu: ఏపీ, తెలంగాణకు ఆక్సిజన్ మళ్లింపు వద్దు, ప్రధాని మోదీకి లేఖ రాసిన తమిళనాడు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని లేఖలో తెలిపిన సీఎం కె పళనిస్వామి
Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami (Photo Credits: ANI)

Chennai, April 25: తెలుగు రాష్ట్రాలకు తమిళనాడు నుంచి 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ మళ్లింపును నిలిపివేయాలని (Tamil Nadu wants diversion of oxygen) ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం నాడు విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ డిమాండ్ పెరగడం దృష్ట్యా దీనిని వెంటనే నిలిపివేయాలని (stopped immediately) తమిళనాడు ముఖ్యమంత్రి  (Tamil Nadu Chief Minister E Palaniswami) ప్రధానికి రాసిన లేఖలో రాశారు.

కోవిడ్ కేసులు పెరుగుతున్నందున మెడికల్ ఆక్సిజన్ అవసరాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, రాష్ట్రంలో (Tamil Nadu) అవసరమైనంత ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం మాపై ఉందని ఆయన అన్నారు. జాతీయ ప్రణాళిక ప్రకారం తమిళనాడుకు ఆక్సిజన్ కేటాయింపు సరిపోదని..ఈ కేటాయింపుతో తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని తమిళనాడు సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

అధిక స్థాయిలో ఆక్సిజన్ ఆధారిత క్రియాశీల COVID-19 కేసుల కారణంగా  ఆక్సిజన్ అవసరం పెరుగుతోందని, అందువల్ల తమిళనాడులో తగినంత ఆక్సిజన్ లభ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కరోనా కేసులను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, కాని ప్రస్తుత పోకడలను పరిశీలిస్తే, టిఎన్‌కు త్వరలో 450 ఎమ్‌టిలు (మెట్రిక్ టన్నులు) ఆక్సిజన్ అవసరమని. అయితే ఇది రాష్ట్ర ఉత్పత్తి సామర్థ్యం 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఏపీ సర్కారు కీలక ఆదేశాలు, సీటీ స్కాన్‌ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

2020లో కరోనా విజృంభించినప్పుడు తమిళనాడులో గరిష్టంగా యాక్టివ్ కేసులు 58,000 ఉండగా, ఈసారి ఇప్పటికే లక్ష దాటిందని సీఎం వివరించారు. నేషనల్ మెడికల్ అక్సిజన్ అలాట్‌మెంట్ ప్లాన్ కింద తమిళనాడుడు 220 మెట్రిక్ టన్నలు కేటాయింపును 'రాంగ్ ఎలాట్‌మెంట్'గా ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో ఆక్సిజన్ వినియోగం 310 మెట్రిక్ టన్నులు ఉండగా, 220 మెట్రిక్ టన్నుల కేటాయింపు ఏమాత్రం సరిపోదని అన్నారు.

తమిళనాడుతో పోలిస్తే అలాట్‌మెంట్ చేసిన రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు తక్కువగా ఉన్నాయని, ఆ రాష్ట్రాల్లో లేదా ఆ రాష్ట్రాలకు సమీపంలో కీలక ఉక్కు పరిశ్రమలున్నాయని ఆయన అన్నారు. ఆ నేపథ్యంలో చెన్నైకి సరఫరా చేసే శ్రీపెరంబుదూరు ప్లాంట్ నుంచి ఆక్సిజన్ మళ్లింపు సమర్ధనీయం కాదన్నారు. దీన్ని తక్షణమే సరిచేయాలని తన లేఖలో పళనిస్వామి కోరారు. తమిళనాడు ఇంతవరకూ ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

ఇండియాలో కరోనా కల్లోలం..అండగా ఉంటామని తెలిపిన ప్రపంచ దేశాలు, భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంటున్న డ‌బ్ల్యూహెచ్ఓ, భారత్‌కు అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందించ‌నున్న‌ట్లు తెలిపిన అమెరికా

ఇతర రాష్ట్రాలకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ మేము సిద్ధంగానే ఉంటాం. అయితే, తమిళనాడు నుంచి లిక్విడ్ ఆక్సిజన్ మళ్లింపు తప్పనిసరి చేయడం వల్ల చెన్నై, ఇతర జిల్లాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తుతుంది. ఆ దృష్ట్యా తమిళనాడులోని శ్రీపెరుంబుదూరు నుంచి 80 కిలోలీటర్ల మళ్లింపు తక్షణం రద్దు చేయాలి' అని మోదీని ఆ లేఖలో పళనిస్వామి కోరారు.