Case Filed Against Telugu NRI : అమెరికాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు ఎన్నారై, న్యూజెర్సీలో కేసు నమోదు చేసిన మరో ఎన్నారై, సారీ అంటూ మరో వీడియో విడుదల చేసిన యాంకర్
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Jersey, April 13: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ యాంకర్ స్వాతిదేవినేని (Telugu NRI Swathi Devineni) అమెరికాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. కరోనావైరస్ (coronavirus) నివారణ చర్యల్లో అమెరికా (America) విఫలం అయ్యిందంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో (Social Media) వదలడం అది కాస్తా వైరల్‌గా మారిపోవడం వివాదంగా మారింది. అమెరికా కరోనా (covid-19) కట్టడిలో పూర్తి విఫలం అయ్యిందని.. భారత్‌ (India) మాత్రం నివారణ చర్యల్లో మంచి ఫలితాలు సాధించిందని ఆమె ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్‌ పొడిగింపుపై వీడనున్న సస్పెన్స్

ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అమెరికాలో ఎన్‌ఆర్‌ఐ యాంకర్ స్వాతి దేవినేనిపై కేసు పెట్టారు. శ్రవణ్ అనే తెలుగు ఎన్‌ఆర్‌ఐ న్యూయార్క్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఓ వీడియోను విడుదల చేశారు.అమెరికాలో ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే విధంగా స్వాతి వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.

Here's NRI Sravanth Poreddy Video

స్వాతి దేవినేని నిన్న ఒక వీడియోను విడుదల చేశారని.. అందులో ఘోరమైన వ్యాఖ్యలు చేశారని.. కరోనావైరస్ నియంత్రణపై భారత్‌ను అమెరికాతో పోల్చడానికి, అమెరికాను విమర్శించడానికి ఆమె ప్రయత్నించారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఇక, ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకుంటామని ఫిర్యాదుదారుడు వ్యాఖ్యానించారు.

అమెరికాలో కరోనా మృత్యుఘోష, తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం

స్వాతి దేవినేని చాలాకాలం నుంచి ఆమె న్యూజెర్సీలో నివసిస్తున్నారు. ఒకట్రెండు తెలుగు న్యూస్ ఛానళ్లకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో కరోనా వైరస్ సృష్టిస్తోన్న విలయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవలే ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందని, ఈ విషయంలో భారత్ అద్భుత పనితీరును కనపరుస్తోందని చెప్పారు. కరోనా వైరస్ చికిత్సలో అమెరికా సైతం భారత్‌పై ఆధారపడిందని, మేరా భారత్ మహాన్ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమె అమెరికాకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచాన ఆగని కరోనా మృత్యుఘోష, లక్షమందికి పైగా మృతి

అమెరికాలో 20 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి నిజమే కానీ దాని ఆధారంగా అమెరికా.ప్రజలను కాపాడటంలో విఫలమైందని వ్యాఖ్యలు చేయడం సరికాదని శ్రవంత్ అన్నాడు.అందుకే స్వాతి దేవినేనిపై న్యూజెర్సీలోని సౌత్ ప్లేన్ ఫీల్డ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.ప్రస్తుతం కరోనా కారణంగా అక్కడి న్యాయస్థానాలు మూతపడినందున పరిస్ధితి అదుపులోకి వచ్చినప్పుడు విచారణ జరుగుతుందని శ్రవంత్ స్పష్టం చేశాడు.

Here's NRI Swathi Devineni Video

మరోవైపు శ్రవంత్ ఫిర్యాదుపై స్పందించిన స్వాతి దేవినేని తాను అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పారు.నిజానికి అది తన ఉద్దేశ్యం కాదని అమెరికాలో కరోనా విజృంభణకు కారణాలు ప్రపంచానికి తెలియజెప్పేలా ఓ య్యూబ్ ఛానెల్ పంపిన స్క్రిప్ట్‌ను తాను చదివానని ఆమె వెల్లడించారు.

కరోనాతో ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు

భారతీయులు ఆర్ధికంగా ఎదగడానికి అమెరికా ఎంతగానో సహాయపడిందో తనకు తెలియని విషయం కాదన్నారు. అయితే యూట్యూబ్ ఛానెల్ స్క్రిప్ట్‌ను చదువుతున్న సమయంలో ఈ వీడియోపై లోగో లేకుండా ప్రసారం అయ్యిందని స్వాతి చెప్పారు. అమెరికా అంటే తనకు ఎంతో గౌరవం వుందని, తాను నివసిస్తున్న దేశాన్ని తిట్టేంత సంస్కారం హీనురాలిని కాదన్నారు.