Nitish Kumar with Narendra Modi (Photo Credits: PTI)

Patna, Nov 10: బీహార్ ఎన్నికల ఫలితాల ట్రెండ్ శర వేగంగా మారుతోంది. తొలి రౌండ్లలో ఆర్జేడీ పలుచోట్ల ఆధిక్యం కనబరిచినప్పటికీ క్రమంగా బీజేపీ ఆధిక్యం (Bihar Assembly Elections 2020 Results) పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్ ప్రకారం, బీహార్‌లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా (single-largest party) నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే మెజారిటీ మార్క్‌ను దాటే అవకాశాలు కూడా మరింతగా కనిపిస్తున్నాయి. మొత్తం 243 స్థానాలకు గాను 129 స్థానాల్లో ఎన్డీయే (NDA) ఆధిక్యం కొనసాగిస్తోంది. మహాఘట్ బంధన్ (Mahaghat Bandhan) 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 15 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

బీజేపీ 74 స్థానాల్లో, ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అయిన జేడీయూ (JDU) 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆర్జేడీ (RJD) 59 స్థానాల్లో, కాంగ్రెస్ (Congress) 21 స్థానాల్లో, ఎల్‌జేపీ (LJP) 5 స్థానాల్లో, వీఐపీ 7 స్థానాల్లో, ఇతరులు 29 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 243 స్థానాల్లో మెజారిటీ మార్క్‌‌ను దాటాలంటే ఇటు ఎన్డీయే కానీ, అటు మహాఘట్ బంధన్ కానీ 122 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది.

నితీష్‌కుమార్‌పై ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ఎగ్జిట్ పోల్స్ అన్నీ మహాఘట్‌బంధన్‌ వైపే, బీహార్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

రాఘోపూర్‌ నుంచి పోటీ చేస్తున్న మహాఘటన్‌ బంధన్‌ (ఎంజీబీ) సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ 700 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. హసన్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న ఆయన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ కూడా ఆదిక్యంలో ఉన్నారు. జాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జీవేశ్‌ కుమార్‌ 2538 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి మహాఘట్‌ బంధన్‌ వందకుపైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతూ.. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది.

సింధియాకు సవాల్‌గా మారిన ఉప ఎన్నికలు, బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుందా? కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? ఎంపీ ఫలితాలు మరి కొద్ది గంటల్లో..

38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన ఆదిక్యం కనబరుస్తుండటంతో బీజేపీ, జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు రాజధాని పట్నాలో ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తొలుత ఆదిక్యం కనబరిచిన కాంగ్రెస్‌-ఆర్జేడీ మహాఘట్‌ బంధన్‌ వెనకంజలో కొనసాగుతుండటంతో అభిమానులు ఒకింత నిరాశకు లోనౌతున్నారు. కౌంటింగ్‌ సరళిని బట్టి ఎన్‌డీఏ కూటమి మెజారిటీకి అవసరమైన స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిహార్‌లోని మొత్తం అసెంబ్లీ సీట్లు 243. మేజిక్‌ ఫిగర్‌ 122.