Delhi Exit Polls (photo-File Image)

New Delhi, Feb 5: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. తాజాగా ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటివరకు ఆరు ఎగ్జిట్ పోల్స్ (Delhi Exit Poll 2025 Results) బిజెపి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి, 35-60 సీట్ల మధ్య ఎక్కడైనా గెలుస్తుందని అంచనా వేసాయి, అయితే అధికార ఆప్ కు 32-37 సీట్ల అంచనాతో అంచనాలు నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తూ, హ్యాట్రిక్ ఒంటరి విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది .68 స్థానాల్లో పోటీ చేస్తున్న బిజెపి గత 28 సంవత్సరాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. వరుసగా 15 సంవత్సరాలు నగరాన్ని పాలించిన కాంగ్రెస్ గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినప్పటికీ ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) కూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి.

ఢిల్లీలో బీజేపీదే అధికారమని అంచనా వేసిన చాణక్య సర్వే, ఆమ్ ఆద్మీ 25 నుంచి 30 సీట్లకు మాత్రమే పరిమతమవుతుందని సర్వే అంచనా

ఒక్క పీపుల్‌ పల్స్‌-కొడిమో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మాత్రం బీజేపీకి ఏకంగా 51-60 సీట్లు వస్తాయని చెప్పగా మిగిలిన సర్వేలన్నీ బీజేపీ,ఆప్‌ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనాలు వెల్లడించాయి. కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ ఢిల్లీలో వరుసగా మరోసారి అధికారాన్ని చేపడుతోందంటూ తన సర్వేలో స్పష్టం చేసింది.చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ పి మార్క్ మాత్రం బీజేపీదే హస్తిన పీఠమని తన సర్వేలో వెల్లడించింది.

ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, బీజేపీదే అధికారమని స్పష్టం చేసిన JVC-Times Now, ప్రతిపక్షానికి కేజ్రీవాల్ పరిమితమవుతారని అంచనా

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్‌,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే జరిగింది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడవనున్నాయి.

సర్వే ఫలితాలు ఇలా..

పీపుల్స్‌పల్స్‌-కొడిమో

బీజేపీ-51-60

ఆప్‌- 10-19

కాంగ్రెస్‌-0

ఇతరులు-0

ఏబీపీ-మ్యాట్రిజ్‌

బీజేపీ- 35-40

ఆప్‌ - 32-37

కాంగ్రెస్‌- 0-1

టైమ్స్‌ నౌ

బీజేపీ-39-45

ఆప్‌-29-31

కాంగ్రెస్‌-0-2

చాణక్య స్ట్రాటజీస్‌

బీజేపీ-39-44

ఆప్‌-25-28

కాంగ్రెస్ 2-3

రిపబ్లికన్‌ పీ మార్క్‌

బీజేపీ 39-41

ఆప్‌ 21-31

ఆ‍త్మసాక్షి

బీజేపీ 38-47

ఆప్‌ 27-30

కాంగ్రెస్‌ 0-3

పీపుల్‌ ఇన్‌సైట్‌

బీజేపీ-40-44

ఆప్‌- 25-29

కాంగ్రెస్‌- 0-1

జేవీసీ

బీజేపీ 39-45

ఆప్‌ 22-31

కాంగ్రెస్‌ 0-2

పీ మార్క్

బీజేపీ 39-49

ఆప్‌ 21-31

కాంగ్రెస్‌ 0-1

పోల్ డైరీ

బీజేపీ 42-50

ఆప్‌ 18-25

కాంగ్రెస్‌ 0-2

డీవీ రీసెర్చ్

బీజేపీ 36-44

ఆప్‌ 26-34

కాంగ్రెస్‌ 0

వీ ప్రిసైడ్

బీజేపీ 18-23

ఆప్‌ 46-52

కాంగ్రెస్‌ 0-1

2015 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆరు సర్వే ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పాయి. అయితే, ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా ఆప్ కు భారీ విజయాన్ని అంచనా వేయలేకపోయాయి. అయితే, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లలో విజయం సాధించింది. బీజేపీకి కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. 2020లో జరిగిన ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీకి ఎనిమిది సీట్లు రాగా, కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ గెలువలేకపోయింది.