Kalvakuntla Kavitha | File Image

Hyderabad, March 18: నిజామాబాద్ ఎమ్మెల్సీ (Nizamabad MLC) స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కే. కవిత (Kalvakuntla Kavitha) పేరు ఖరారైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసిన ఆమె, అక్కడ్నించి నేరుగా నిజామాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం 11:30 వరకు కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు.

ఈ స్థానికి ఎమ్మెల్సీగా ఉండే ఆ. భూపతి రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయిండంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు పోటీ పడ్డారు. అయితే మంగళవారం పార్టీ నేతలతో విస్తృతంగా చర్చలు జరిపిన సీఎం కేసీఆర్, ఈ స్థానాన్ని కవితకే ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  నిజామాబాద్ స్థానానికి ఉపఎన్నిక, షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమీషన్

గత ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌లోకసభ స్థానంలో సమీప బీజేపీ ప్రత్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. అర్వింద్ స్వయానా ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్, ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ రెబెల్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు. ఎన్నికల్లో ఓడిపోయిన డి. శ్రీనివాస్‌కు టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి రాజ్యసభ ఎంపీని చేసినప్పటికీ, నిజామాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి పనిచేశారని ఆయనపై పార్టీలో అభియోగం ఉంది.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన కుమార్తె కవితను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అప్పటికే కేసీఆర్ మేనళ్లుడు జె సంతోష్ కుమార్ రాజ్యసభలో సభ్యులుగా ఉండటం మరియు ప్రస్తుతం తెలంగాణ కోటాలో 2 మాత్రమే ఉన్న ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు విపరీతమైన పోటీ ఉండటం, అప్పటికే కేసీఆర్ చాలా మందికి హామీ ఇచ్చి ఉండటం ఇలా రకరకాల కారణాల చేత కవితను రాజ్యసభకు నామినేట్ చేయలేదని సమాచారం. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన, ఆ ఇద్దరినీ నామినేట్ చేసిన సీఎం కేసీఆర్

అందుకు బదులుగా నిజామాబాద్ ఎంఎల్సీని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి కావాల్సినంత సంఖ్యా బలం ఉండటంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఏకగ్రీవమే కానుంది.