5 States Assembly Elections Result Predictions: దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటలకు ముగియనున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం ఒకే దశలో ఎన్నికలు జరగ్గా, చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో పూర్తి అయ్యింది. తెలంగాణలో నవంబర్ 30 గురువారం సాయంత్రంతో పూర్తి కానున్నాయి. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఎగ్జిట్ ఫలితాలు ( Assembly Elections Result Predictions) వెలువడనున్నాయి. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనే అంచనాలతో ఈ ఎగ్జిట్ ఫలితాలు (Exit Polls 2023 Results) విడుదల కానున్నాయి.
నవంబర్ 30 సాయంత్రం 5 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల సంఘం నవంబర్ 30 వరకు ఐదు రాష్ట్రాలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించడాన్ని నిషేధించిన సంగతి విదితమే.
2023లో రాజస్థాన్‌లో 74.6% ఓటింగ్ నమోదవ్వగా, 2018 నాటి 74.24 % కంటే స్వల్పంగా మెరుగ్గా ఉంది. మధ్యప్రదేశ్ 2018లో 75%తో ఓటింగ్‌తో పోలిస్తే 2023లో దాదాపు 76% ఓటింగ్‌తో మెరుగ్గా ఉంది. నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరంలో 77.04% పోలింగ్ నమోదైంది. అదే రోజు, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో పోలింగ్ జరిగిన 20 అసెంబ్లీ స్థానాల్లో 70.87 శాతం ఓటింగ్ నమోదైంది. మిగలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు 119 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు. ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉండాలని కాంగ్రెస్ భావిస్తుండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరో సారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. అలాగే తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఎగ్జిట్ పోల్స్ వెలువడితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదని ఇంతకు ముందే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ సమయాన్ని ఈసీ సవరించింది. సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించవచ్చని తెలిపింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయింది. ఈ సాయంత్రంతో తెలంగాణలో కూడా పోలింగ్ పూర్తి కానుండటంతో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.