Telangana Assembly Election 2023 Polling Live Updates: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల స్పల్ప ఘటనలు మినహా తెలంగాణ (Telangana Assembly Elections 2023) వ్యాప్యంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, సినీతారలు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ఓటేసేందుకు ఉదయం నుంచే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు
మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69. 33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే రూరల్ ఏరియాలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతుండగా..హైదరాబాద్ (Hyderabad) నగరంలో మాత్రం తక్కువ పోలింగ్ నమోదవుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా, సాయంత్రం పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.
ఓటింగ్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO)వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కొన్ని చోట్ల ఈవీఎంలు మార్చినట్లు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోందని తెలిపారు. నగర ఓటరు ఇండ్లను వీడి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. మధ్యాహ్నం నుంచి వేగం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చాయని వాటిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామన్నారు.
తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు (Telangana Assembly Elections ) పోలింగ్ కొనసాగుతుండగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎన్నికల అధికారులకు, స్టేట్ ఎన్నికల కమిషన్‌కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, ఈవీఎంల విషయమై సీఈవో వికాస్‌రాజ్.. డీఈవోలతో కోఆర్డీనేట్ అయ్యారు.
మరోవైపు.. ఈవీఎంల మొరాయింపుపై సీఈవో వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ క్రమంలో ఈవీఎంలలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సమయాన్ని పెంచాలని కాంగ్రెస్ నేతలు సీఈవోను కోరారు.