Bhopal, May 22: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి ఆగడం లేదు, కరోనా దెబ్బకు అన్నీ పనులు వాయదా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మధ్య ప్రదేశ్ లో (Madhya Pradesh) ఓ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే ఓ యువతికి కరోనా (Newly married bride tests positive for covid-19) ఉన్నట్లు తేలింది. దీంతో అటు వధూవరుల కుటుంబాలతోపాటు పెళ్లికి వచ్చిన బంధువుల్లోనూ కలవరం మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కరోనా కలవరం, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కోవిడ్-19 పాజిటివ్, ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంజయ్ ఝా
ఘటన వివరాల్లోకెళితే.. భోపాల్‌లోని జట్ ఖేడి ప్రాంతానికి చెందిన యువతికి మంగళవారం పరిమిత బంధువుల సమక్షంలో వరుడితొ వివాహం జరిగింది. అయితే ఆమె గత కొద్ది రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతోంది. దీంతో ఆమె మాత్రలు వేసుకుంటూ కాస్త ఉపశమనం పొందుతూ వచ్చింది. ఎందుకైనా మంచిదని పరీక్షలు కూడా చేయించుకుంది. ఈ క్రమంలో గురువారం వచ్చిన పరీక్షా ఫలితాల్లో ఆమెకు కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6088 కోవిడ్ 19 కేసులు, ఇండియాలో లక్షా 18 వేలు దాటిన కరోనా కేసులు సంఖ్య, 3583కి చేరిన మృతుల సంఖ్య
అనంతరం వధూవరుల ఇంటిసభ్యులతోపాటు పెళ్లికి హాజరైన 32 మంది బంధువులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా 50 మంది అతిథుల మధ్య వివాహాలు జరుపుకోవచ్చని కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. కాగా మధ్య ప్రదేశ్‌లో కేసుల సంఖ్య ఆరు వేలకు చేరుకుంది.