Patna, November 16: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం (Nitish Kumar Takes Oath as Bihar Chief Minister) చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాల్గవసారి ఆయన సొంతం చేసుకోగా.. ఏడవ సారి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యారు. సోమవారం ఏర్పాటు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ నితీష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ చీఫ్ అమిత్‌షా, జేపీ నడ్డా, దేవేంద్ర ఫడ్నవిస్ హాజరయ్యారు. బీహార్ లో ఎన్‌డీఏ కొత్త సర్కార్ కొలువు దీరింది. బీజేపీ నుంచి ఏడుగురికి, జేడీయూనుంచి ఐదుగురికి కేబినెట్‌లో చోటు దక్కగా, ఉపముఖ్యమంత్రి పదవులను బీజేపీ సొంతం చేసుకుంది.
12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు తార్‌కిషోర్ ప్రసాద్ , రేణూ దేవీ పదవీ స్వీకార ప్రమాణం (Tarkishore Prasad, Renu Devi Sworn In as Deputy CM) చేశారు. రాష్ట్రంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నితీస్ రికార్డు సృష్టించారు. స్వాతంత్య్రానికి ముందు నుండి 1961 లో మరణించే వరకు పదవిలో ఉన్న శ్రీకృష్ణ సింగ్ రికార్డును ఆయన అధిగమించారు. 2000లో (వారం రోజులే పదవిలో ఉన్నా) మొదటిసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు .
స్పీకర్ పోస్ట్ మాదే అంటున్న బీజేపీ
ఇదిలా ఉంటే నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆర్జేడీ పార్టీ బాయ్‌కాట్ చేసింది. జేడీయూ నేతలు విజయ్ కుమార్ చౌదరీ, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరీ, మేవా లాల్ చౌదరీలు.. క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో.. సుశీల్ మోదీ కంగ్రాట్స్ తెలిపారు. ఏడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని, మీ నాయకత్వంలో బీహార్ మరింత ముందుకు వెళ్తుందని, ప్రధాని మోదీ మద్దతు బీహార్‌కు ఎళ్లవేళలా ఉంటుందని సుశీల్ మోదీ తన ట్వీట్‌లో తెలిపారు.
వీరిలో బిహార్ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా థార్ కిషోర్, శాసనసభాపక్ష ఉప నేతగా రేణు దేవిని ఇప్పటికే ఎన్నుకన్నారు. ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం స్వీకారం చేసిన అనంతరమే వీరిద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.నవంబర్ 10న వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Assembly Elections 2020) ఎన్డీయే కూటమి స్వల్ప మెజారిటితో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది.
ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఎక్కువ స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ స్థానాలను అందుకోలేకపోయింది. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 స్థానాలు కావాలి. కాగా, ఎన్డీయే 125 స్థానాలు గెలచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేసుకుంది.