Baksa, April 3: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ అస్సాంలో పర్యటించారు. తముల్‌పుర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Assam Assembly Election 2021) మాట్లాడుతూనే మధ్యలో ఒక్కసారిగా ప్రసంగాన్ని ఆపేశారు. నేడు తమూల్పూర్ లో చివరి దశ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఆ సభకు హాజరైన బీజేపీ కార్యకర్త ఒకరు కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రసంగాన్ని (PM Narendra Modi Halts Speech in Assam) ఆపారు. అతడు కళ్లు తిరిగిపడిపోవడాన్ని సభకు వచ్చిన వారు ఎవరూ గమనించలేదు. అది తనకంట పడడంతో, ఆయన అందరినీ అప్రమత్తం చేశారు.
ఆయనకు వైద్యం చేయాలంటూ పీఎంవో వైద్య బృందాన్ని కోరారు. ‘నాతో పాటు వచ్చిన వైద్యులారా (పీఎంవో వైద్యులు).... దయచేసి ఆ కార్యకర్త వద్దకు వెళ్లండి. ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. దయచేసి పరీక్షించండి. వెంటనే సహాయం (Sends PMO Medical Team to Check BJP Worker) చేయండి.’’ అని ప్రధాని మోదీ ఆదేశించారు.ప్రొటోకాల్ ప్రకారం, ప్రధానితో పాటు నలుగురు వైద్యుల బృందం వస్తుంటుంది. అన్ని రకాల వైద్య పరికరాలనూ, అత్యవసర ఔషధాలను వారు వెంట తీసుకొస్తారు.
Here's PM Speech Video
Pausing in the middle of his speech at Tamulpur in Assam, PM @narendramodi promptly directed the team of PMO doctors to give immediate assistance to an old-aged person, Shri Hari Charan Das, in the rally who was apparently dehydrated.
He has been attended to and is stable now. pic.twitter.com/iuCMCy9LqF
— BJP (@BJP4India) April 3, 2021
అందరి కోసం బీజేపీ పనిచేస్తుందని, కానీ, కొన్ని పార్టీలు కొందరి కోసమే పనిచేస్తాయని మోదీ ఈ సభలో ప్రసంగిస్తూ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని వారు విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందరి కోసం పనిచేసే పార్టీనేమో మతతత్వ పార్టీ అని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే పార్టీలను లౌకిక పార్టీలంటూ పిలుస్తున్నారని, అది ఎంత వరకు కరెక్ట్? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం.. అసోం అకార్డ్ (ఒప్పందం)ను పూర్తిగా అమలు చేసేందుకు కృషి చేస్తోందన్నారు. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అసోం ప్రజలు ఎన్డీయేకే ఓటేసేందుకు నిర్ణయించుకున్నారని అన్నారు. అసోం గుర్తింపును పోగొట్టి, హింసకు పాల్పడే పార్టీలను వారు సహించబోరని తేల్చి చెప్పారు.
హింసా మార్గంలో పయనిస్తున్న మిలిటెంట్లు.. ఆయుధాలను వదిలిపెట్టి ప్రజాజీవితంలో కలిసి పోవాలని మోదీ కోరారు. శాంతియుత ఆత్మనిర్భర్ అస్సాంను నిర్మించేందుకు కలిసి రావాలన్నారు. తల్లులు, సోదరీమణులకు హామీ ఇస్తున్నాని, మీ పిల్లలు ఆయుధాలు పట్టుకోరు అని, వాళ్లు తమ జీవితాలను అడవుల్లో గడపాల్సిన అవసరం లేదని, ఎటువంటి బుల్లెట్లకు నేలరాలవద్దు అని ఆయన అన్నారు.
అస్సాం ఐడెంటిటీని అవమానించేవారిని, హింసను ప్రోత్సహించేవారిని అస్సామీ ప్రజలు బహిష్కరిస్తారని కాంగ్రెస్ కూటమిని ఆయన విమర్శించారు. గత అయిదేళ్లలో బూపెన్ హజారికా సేతు, బోగిబీల్ బ్రిడజ్‌లను నిర్మించామని, మరో అరడజన బ్రిడ్జ్‌లు నిర్మాణంలో ఉన్నాయని, మేం ఏదైనా స్కీమ్‌ను రూపొందిస్తే, దాని ఫలితాలు అందరికీ అందేలా చూస్తామని, సబ్‌కా సాత్, సబ్‌కా వికాశ్ తమ నినాదమని ప్రధాని మోదీ అన్నారు.