![](https://test1.latestly.com/wp-content/uploads/2020/02/Vidya-Rani-Joins-BJP-380x214.jpg)
Krishnagiri, Febuary 23: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ (Sandalwood Smuggler Veerappan) కూతురు విద్యారాణి ఎట్టకేలకు ప్రజాసేవలోకి వచ్చారు. కాషాయపు కండువాను కప్పుకున్నారు. శనివారం తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో జరిగిన సదస్సులో ఆమె (Vidya Rani) బీజేపీలోకి జాయిన్ అయ్యారు.
సుప్రీం తీర్పులకు 130 కోట్ల మంది మద్ధతు
పార్టీ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు, కేంద్ర మాజీ మంత్తి పొన్ రాధాకృష్ణన్ (Pon Radhakrishnan) సమక్షంలో ఆమె పార్టీ తీర్థం (Vidya Rani Joins BJP) పుచ్చుకున్నారు. మురళీధర్ రావు (Muralidhar Rao) ఆమెకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఇదిలా ఉంటే 2004 అక్టోబరు 18న వీరప్పన్ మరణం తర్వాత అతని గురించి ప్రస్తావన రావడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు.
జాయిన్ అయిన తరువాత విద్యారాణి మాట్లాడుతూ... 'నాన్న అనుసరించిన మార్గం తప్పు అయి ఉండొచ్చు. కానీ, ఆయనెప్పుడూ పేదల కోసమే పనిచేశారు. కులాలు.. మతాలకు అతీతంగా పేదల కోసం పని చేయాలనుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాను' అని తెలిపింది. విద్యారాణితో పాటు ఇతర పార్టీలకు చెందిన 1000మంది సభ్యులు బీజేపీలోకి జాయిన్ అయ్యారు.
ఉద్రిక్తతల వేళ పాక్ పర్యటనలో కాంగ్రెస్ నేత
వృత్తిరీత్యా లాయర్ అయిన విద్యారాణి సోషల్ వర్కర్‌గానూ పనిచేస్తున్నారు. ఇదివరకు కూడా విద్యారాణి వార్తలో నిలిచారు. బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి విషయంలో తల్లి ముత్తులక్ష్మీ నిరాకరించడంతో తమిళనాడు హైకోర్టుకు వెళ్లి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుంది.
కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్ అలియాస్ వీరప్పన్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వణికించిన సంగతి విదితమే. చందనం కలప స్మగ్లింగ్‌తో ప్రారంభమైన వ్యవహారం సినీ ప్రముఖులను కిడ్నాప్ చేసే వరకు వెళ్లింది. కొందరు పోలీసులు కూడా వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. వీరప్పన్, అతని అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ కుకూన్ పేరుతో ప్రణాళికను రచించింది.
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ భారత్ బంద్
ఈ ఆపరేషన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ నాయకత్వంలో సాగింది. 1991లో ఆరంభమైన ఈ ఆపరేషన్ 2004 అక్టోబర్ 18న వీరప్పన్, అతని అనుచరులు సేతుకాళి గోవిందన్, చంద్రె గౌడ, సేతుమునిలను కాల్చిచంపడంతో ముగిసింది. ఇది దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖర్చు అయిన ఆపరేషన్ గా నిలిచింది.
కాగా ప్రస్తుతం వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి మైసూర్ జైల్లోఉంది. జామీనుపై విడుదలకు సహకరించాల్సిందిగా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వేడుకుంది. ఎప్పుడో నా భర్త చేశాడని చెబుతున్న నేరానికి తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లోనే తనను అరెస్టు చేసి ఉంటే ఈ పాటికి శిక్షాకాలం కూడా పూర్తయి ఉండేదని చెప్పింది. వీరప్పన్, ముత్తులక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.