Chennai, Febuary 9: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (South Indian Super Star Rajinikanth) రాజకీయాల్లోకి రావడంపై గత కొంత కాలం నుంచి ఆసక్తికర చర్చే జరుగుతోంది. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ గత కొంత క్రితమే రజినీకాంత్ ప్రకటించినప్పటికీ.. ఆయన ఎప్పుడు వస్తారనే విషయంపై ఇప్పటి దాకా స్పష్టత లేదు. అయితే, తాజాగా, మరోసారి ఆయన రాజకీయ అరంగేట్రంపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. సీఏఏకు మద్ధతు తెలిపిన రజినీకాంత్
రజినీకాంత్ తన రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం ముహూర్తం ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే రజినీకాంత్ తన రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని రజినీ మక్కల్ మంద్రంకు (Rajini Makkal Mandram) చెందిన నేతలు కూడా ధృవీకరించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన రజినీకాంత్
శివాజీ రాజ్ గైక్వాడ్ (Shivaji Rao Gaekwad) అలియాస్ రజనీకాంత్ దాదాపు 22ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. 1996లో అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు (Jayalalithaa) వ్యతిరేకంగా కామెంట్లు చేసిన రజనీకాంత్ 2017 డిసెంబరు 31న రాజకీయాల్లోకి వస్తానని అనౌన్స్ చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చ లేదు. అడపాదడపా దీనిపై సోషల్ మీడియాలో వార్తలు రావడమే కాని ఆయన నుంచి అధికారిక సమాచారం లేదు.
రజనీ మక్కల్ మంద్రంను లాంచ్ చేసి అఫీషియల్‌గా ఏప్రిల్ నుంచి రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 14 తర్వాత ఎప్పుడైనా తన రాజకీయ పార్టీని లాంచ్ చేయొచ్చని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
2021లో తమిళ ప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారు
ఇదిలా ఉంటే చాలా మంది రజనీకాంత్ బీజేపీ (BJP) వల్ల ప్రభావితమయ్యారని, అంతేకాకుండా చెన్నైలో ఉన్న ఆర్ఎస్ఎస్ లీడర్ ఎస్ గురుమూర్తి ( RSS leader S Gurumurthy) ప్రభావం కూడాఉందని కొందరు చర్చించుకుంటున్నారు.
అదే సమయంలో రజనీకి సలహాదారుగా, రాజకీయ విశ్లేషకుడిగా తమిళరువి మణియన్ వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మణియన్ మాట్లాడుతూ.. రజినీకాంత్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అనేదానిపై స్పష్టత లేదన్నారు.
అమిత్ షా.. బలవంతంగా హిందీని మాపై రుద్దవద్దు
'బీజేపీతో ఒప్పందం కుదుర్చుకోవడమేనది రజనీకాంత్ స్వయంగా నిర్ణయించుకోవాలి. కానీ, దినకరన్‌తో సంధి చేసుకోవడం నెగెటివ్ ప్రభావం తీసుకొచ్చేలా ఉంద'ని ఆయన చెప్పారు. అయితే రజినీకాంత్‌కు బీజేపీ సహాయం కచ్చితంగా ఉంటుందని కొన్ని వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
రజినీ తొలి బహిరంగ సభ 2020 ఆగస్టులో జరుగుతుందని, రజిని సెప్టెంబర్ నుంచి తమిళనాడు అంతటా పర్యటించాలని యోచిస్తున్నట్లు సమాచారం. రజిని పార్టీ ప్రారంభోత్సవంతో, తమిళనాడు రాజకీయాలు పెద్ద మలుపు తీసుకుంటాయని భావిస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడుతో ఎన్నికలు జరగనున్నాయి.