
Amaravati, June 8: టీడీపీ శాసనసభ్యుడు కరణం బలరాం (TDP MLA Karanam Balaram) తెలుగుదేశం పార్టీ మీద, దాని అధినేత మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము టీడీపీ అధినేత చంద్రబాబుతో (TDP Chief Chandrababu) ) ఎంతకాలం నుంచి ఉన్నామో అందరికీ తెలుసని, ఎంత ఇబ్బంది పడ్డామో కూడా తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. చంద్రబాబు వైఖరికి, జగన్ వ్యవహారశైలికి ఎంతో తేడా ఉందని, జగన్ (YS Jagan) తనను నమ్మినవాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తాడని స్పష్టం చేశారు. జగన్ తండ్రి వైఎస్ తోనూ తమకు సన్నిహిత సంబంధాలుండేవని కరణం గుర్తుచేసుకున్నారు.
దీంతో పాటుగా వెలుగొండ విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు అసంపూర్తిగా ఉందని, అది తమ వైఫల్యం కాదని అన్నారు. వెలుగొండ విషయంలో ఎంతో ఒత్తిడి తెచ్చినా అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక, వైసీపీలోకి వెళ్లేందుకు టీడీపీ శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారని, అయితే ఎంతమంది వస్తారన్నది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఏపీలో అన్నీ ఓపెన్, తాజాగా 125 కోవిడ్ 19 కేసులు, జ్వరం,దగ్గు లక్షణాలుంటే వెంటనే 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు
10 మందో, 12 మందో చెప్పలేను కానీ... కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వైసీపీలో చేరాలని భావిస్తున్నారని వివరించారు. వారు సీఎం జగన్ తోనూ, ఇతర వైసీపీ ముఖ్యనేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కూడా ఇందుకు మినహాయింపు కాదని, మరికొన్నాళ్ల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని కరణం పేర్కొన్నారు.
నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాను వైసీపీలో చేరుతున్నా అని చెప్పారు. చంద్రబాబు అసమర్థత వల్లే గత ప్రభుత్వంలో అబివృద్ధి జరగలేదని విమర్శించారు. టీడీపీలో సమస్యలు ఉన్నాయని కరణం అన్నారు.ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్ కు కరణం బలరాం అభినందనలు తెలిపారు. ఏడాదిలో జగన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కితాబిచ్చారు. ఏడాది కాలంలో జగన్ ప్రజల్లో నమ్మకం కలిగించుకున్నారని చెప్పారు. ప్రజల కోసం చంద్రబాబు చిత్తశుద్దితో పని చేయలేదని కరణం బలరాం విమర్శించారు. బీజేపీతో పొత్తుకు టీడీపీ మళ్లీ ప్రయత్నిస్తోందన్నారు.