
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్ గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆలోచన నిజమైన రోజది. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చారు.
2014 జూన్ 2న రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం సంప్రదాయంగా వస్తున్న అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికి, జూన్ 2న నవ నిర్మాణ దీక్షల పేరుతో అవతరణ దినోత్సవాన్ని మార్చేశారు. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం జగన్ పూర్వపు ఆంధ్రరాష్ట్ర అవతరణ అయిన అక్టోబర్ 1న జరుపుకోవాలనే ఒక వాదన ఉన్నప్పటికినీ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1న మాత్రమే అవతరణ దినోత్సవాన్ని జరపాలని ప్రస్తుత వై యస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించి పాత సాంప్రదాయాన్నే పాటిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేద్దాం.
1. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చూసిన అమర జీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

2. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

3. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవసరాన్ని చాటి చెప్పిన రాష్ట్రం ఆంధ్ర. అందరికీ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

4. అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.