Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-1.jpg

ఇస్లాం మతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో ఒకటి ఈద్ మిలాద్-ఉన్-నబీ లేదా మౌలిద్ అల్-నబీ ఒకటి. మౌలిద్ అనే అరబిక్ పదానికి పుట్టిన రోజు అనే అర్థం ఉంది. ఈ రోజు మహ్మద్ ప్రవక్త జన్మించిన రోజుతో పాటు ఆయన మరణించిన రోజుగా కూడా పరిగణించబడుతుంది. ఈ కారణంగా ఈ పండుగకు ప్రత్యేకమైన భక్తి భావం ఉంటుంది.ఈ వేడుకను ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం రబీ-ఉల్-అవ్వల్ నెల 12వ తేదీన జరుపుకుంటారు. రబీ-ఉల్-అవ్వల్ నెల ఇస్లామిక్ సంవత్సరంలో మూడవ నెల.

ఇస్లామిక్ క్యాలెండర్ చంద్ర ఆధారితమైనది కాబట్టి, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు ప్రతీ సంవత్సరం మారుతుంది. 2025లో ఈద్ మిలాద్-ఉన్-నబీ (మౌలిద్) ఉత్సవం సెప్టెంబరు 4 సాయంత్రం నుండి సెప్టెంబరు 5 రోజు (శుక్రవారం) వరకు జరుపుకుంటారు.

మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు, మిత్రులకు, బంధు మిత్రులకు ఈద్ మిలాద్ శుభాకాంక్షలు మెసేజ్ రూపంలో తెలియజేయండిలా..

మహ్మద్ ప్రవక్త 570 CEలో సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో జన్మించారని ముస్లింలు నమ్ముతారు. ఆయనను ముస్లింలు ఖాతమ్-ఉన్-నబియ్యీన్ (ప్రవక్తలలో చివరివాడు) అని గౌరవిస్తారు.

Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-1.jpg

మహ్మద్ ప్రవక్త జీవితం మానవ సమాజానికి ప్రేమ, శాంతి, కరుణ, సమానత్వం, ఐక్యత వంటి విలువలను అందించింది. ఆయన బోధనలు ఇస్లాం మతానికి ఆధారస్తంభాలుగా పరిగణించబడుతున్నాయి.

ఈ పండుగ చరిత్రలోకి వెళ్తే, 8వ శతాబ్దంలో మహ్మద్ ప్రవక్త పుట్టిన ఇల్లు ప్రార్థనా

Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-4.jpg
Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-4.jpg

మందిరంగా మార్చబడింది.

Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-2.jpg
Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-2.jpg

అక్కడే ఆయన పుట్టిన రోజు ప్రత్యేకంగా గమనించబడేది. 11వ శతాబ్దంలో ఈజిప్ట్‌లోని ఫాతిమీ వంశం మౌలిద్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఆ తరువాత ఇది ఇస్లాం ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రసిద్ధి చెందింది.

Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-2.jpg
Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-2.jpg

ఈ రోజున ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఖురాన్ నుండి శ్లోకాలు పారాయణం చేస్తారు. మహ్మద్ ప్రవక్త జీవితం, బోధనలు గురించి ప్రసంగాలు, ప్రవచనాలు వినిపిస్తారు.

Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-4.jpg
Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-4.jpg

కొందరు సమాజంలో పేదలకు ఆహారం, దుస్తులు, సహాయం అందిస్తూ ఆయన కరుణ, సేవా తత్త్వాన్ని స్మరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఘనంగా జరుపబడుతుంది. మసీదులు, ఇళ్లు, వీధులు దీపాలంకరణలతో అందంగా అలంకరిస్తారు.

Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-4.jpg
Eid-e-Milad-un-nabi-Wishes-In-Telugu-4.jpg

అయితే, ఇది మహ్మద్ ప్రవక్త మరణ దినంగా కూడా పరిగణించబడుతున్నందున, ఎక్కువ మంది ఈ రోజును భక్తి, ప్రార్థన, ధ్యానంతో గుర్తించడానికి ప్రాధాన్యత ఇస్తారు.