Pitru Paksha (File Image)

పురాణాల్లో గరుడ పురాణం, మార్కండేయ పురాణం వంటి ప్రాచీన గ్రంథాలలో మనిషి జీవితంలో మూడు ప్రధాన ఋణాలు గురించి చెప్పడం జరిగింది. అవేంటంటే.. దేవ రుణం, గురు రుణం, పితృ రుణం. అందులో పితృ రుణం అంటే పూర్వీకులకు కృతజ్ఞత తెలిపి.. వారి ఋణం తీర్చుకునే సమయంగా పితృపక్షం పరిగణించబడుతుంది.

ఈ పవిత్రమైన 16 రోజుల కాలం (పక్షం) ఆధ్యాత్మికతతో పాటుగా సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ సమయంలో పూర్వీకుల ఆత్మలు భూమికి వచ్చి తమ వారసుల నుండి నైవేద్యాలు, శ్రద్ధా కర్మలు, తర్పణాలు స్వీకరిస్తారని పెద్దల నమ్మకం. ఈ కర్మల ద్వారా పూర్వీకులకు పోషణ, శాంతి లభిస్తుందని, వారు మోక్షం పొందడం లేదా పునర్జన్మ చక్రాల నుండి విముక్తి పొందుతారని విశ్వాసం.

బీపీ వున్న వారు వీటిని అసలు ముట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేస్తే మాత్రం గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ, హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు

పితృపక్షం ఆచారాలు, విశ్వాసాలు

శ్రాద్ధం, తర్పణం: పితృపక్షంలో ప్రధాన ఆచారాలు. పూజారుల సహాయంతో పూర్వీకుల ఆత్మలకు నీటితో తర్పణం, పిండప్రదానం, నైవేద్యం సమర్పిస్తారు.

తీర్థయాత్రలు: ఈ కాలంలో గయ, వారణాసి వంటి పవిత్రక్షేత్రాలలో పితృ కర్మలు నిర్వహించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

శుభకార్యాలు నివారణ: పితృపక్షాన్ని కొత్త ప్రారంభాలకు అనుకూలంగా పరిగణించరు. ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయరాదు.

బెంగాల్‌లో ప్రాధాన్యం: బెంగాల్‌లో పితృపక్షం మహాలయ పూజతో దుర్గాపూజా ప్రారంభానికి సూచికగా పరిగణిస్తారు.

పితృపక్షం 2025 తేదీలు: 2025లో పితృపక్షం సెప్టెంబర్ 7న ప్రారంభమై సెప్టెంబర్ 21న ముగుస్తుంది. ఈ సమయంలో ప్రతి రోజూ పూర్వీకులను స్మరించి శ్రద్ధా కర్మలు చేయడం ఉత్తమంగా భావిస్తారు.

పితృపక్షం ఫలాలు: పూర్వీకుల ఆశీర్వాదంతో ఆరోగ్యం, ఆయుష్షు, జ్ఞానం, శ్రేయస్సు కలుగుతాయి. కుటుంబంలో సుఖసంపదలు, కార్యసిద్ధి చేకూరతాయి. ఆచారాలను నిర్లక్ష్యం చేస్తే పూర్వీకులలో అశాంతి, జీవితంలో దురదృష్టాలు కలగవచ్చని నమ్మకం.

పితృపక్షం మన వంశపారంపర్యానికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ కాలంలో కృతజ్ఞతా భావంతో శ్రద్ధా కర్మలు చేయడం మనకు, మన కుటుంబానికి శ్రేయస్సు అందించే మార్గం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి