ఏపీలో అత్యంత చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 10వ తేదీ నుంచి ఘనంగా (Ram Navami Celebrations in vontimitta) నిర్వహించనున్నామని కలెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు. ఇందులో భాగంగా 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగే కల్యాణోత్సవానికి (Ram Navami 2022) ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి బుధవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జేసీ సి.ఎం సాయికాంత్ వర్మ, ఎస్పీ కేకే అన్బురాజన్, శిక్షణ కలెక్టర్ కార్తీక్‌తో కలసి కలెక్టర్ సంబంధిత అధికారులు, టీటీడీ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. కాగా ఒంటి మిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్స వాల్లో భాగంగా 15న కల్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి హాజరు కానున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10 నుంచి 19 వరకు కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగే కల్యాణోత్సవానికి (Ram Navami Celebrations) సీఎంతో పాటు పలువురు రాష్ట్ర స్థాయి ప్రముఖులు విచ్చేయనుండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్నిరకాల మౌలిక వసతులను పూర్తి చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కోదండరామ స్వామి కల్యాణోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు.
15 న శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిం చేందుకు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయా లన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్న ప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పా టు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 108 వాహనాలు, అత్యవసర మం దులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు మొదలైన అన్ని అంశా లను ఎలాంటి కొరత లేకుండా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాజంపేట ఎంఎల్‌ఎ మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ బ్రహ్మోత్సవాలకు ముత్యాల తలండ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొస్తారని చెప్పారు. సమావేశానికి హాజరైన ఎంపిటిసిలు, సర్పంచులు, అధికారులు ఒంటిమిట్ట బ్రహ్మోత్స వాలకు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.