
SEXtember 2025 Explained in Telugu: సెప్టెంబర్ నెలను మరింత అర్థవంతం చేసే ఒక ప్రత్యేక ప్రచారం SEXtember వస్తోంది. అదేంటి పేరు చాలా ఢిపరెంట్ గా ఉందని అనుకుంటున్నారా.. అవును ఈ నెల అంతా ఈ ప్రచారం జరుపుకుంటారు. ఈ ప్రచారం ప్రధానంగా లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఏర్పాటైంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరుపుకునే ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా యువత, విద్యాసంస్థలు, ఆరోగ్య నిపుణులును ఒకే వేదిక పైకి తీసుకువస్తుంది. లైంగికత, ఆరోగ్య సమస్యలు, సురక్షిత పద్ధతులు, సమ్మతి వంటి ముఖ్యమైన అంశాలపై మాట్లాడటంలో ఉన్న నిషేధాన్ని తొలగించడం ఈ ఉద్యమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా ఉంది.
SEXtember మొదట 2020లో పురుషుల వెల్నెస్ బ్రాండ్ ‘Bold Care’** ద్వారా ప్రారంభించడం జరిగింది. లైంగిక ఆరోగ్యంపై ప్రజల్లో ఉన్న సిగ్గు, అపోహలు తొలగించడానికి ఇది ఒక మొదటి ప్రయత్నంగా స్టార్ట్ చేశారు. ప్రారంభంలో ప్రధానంగా పురుషుల సమస్యలైన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ (ED), అకాల స్ఖలనం వంటి ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టారు. తర్వాత ఇది సమగ్ర లైంగిక ఆరోగ్య అవగాహన కార్యక్రమంగా మారింది. ప్రస్తుతం ఇది కళాశాలలు, కంపెనీలు, ఆరోగ్య సంస్థలు, సోషల్ మీడియా వేదికల ద్వారా జరుపుకునే ప్రపంచవ్యాప్త ఉద్యమంగా గుర్తింపు పొందింది.
SEXtember 2025లో ప్రధానంగా దృష్టి పెట్టే విషయాలు ఇవే..
లైంగిక ఆరోగ్య సమస్యలపై నిజాయితీ చర్చలు జరపడం.
సురక్షితమైన లైంగిక పద్ధతులు (safe sex practices) గురించి అవగాహన పెంచడం.
STDలు (Sexually Transmitted Diseases), STIలు (Sexually Transmitted Infections)పై పరీక్షలు చేయించుకోవడానికి ప్రోత్సహించడం.
సమ్మతి (Consent)ప్రాముఖ్యత, దాన్ని ఎలా గౌరవించాలి అనే అంశాలను బోధించడం.
లైంగికతపై సమాజంలో ఉన్న నిషేధ భావనలను తొలగించడం.
SEXtemberలో కళాశాలలు, విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొంటాయి. వర్క్‌షాప్‌లు, సెమినార్లు, సరదా కార్యకలాపాలు నిర్వహించి, లైంగిక ఆరోగ్యం ఒక సహజమైన విషయం అని తెలియజేస్తారు. పాఠశాలలు, కళాశాలలు, ఆరోగ్య సంస్థలు STDలపై పరీక్షలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు లైంగిక ఆరోగ్యంపై ఉన్న భయాన్ని తొలగించి, ఒక ఆరోగ్యకరమైన, అవగాహన కలిగిన సమాజం నిర్మాణానికి దోహదపడతాయి.
2025లో జరగబోయే SEXtember వేడుకలు ఈ సారి పెద్ద స్థాయిలో జరగనున్నాయి. సమాజంలో లైంగిక ఆరోగ్యంపై ఉన్న అపోహలు తొలగించి, అందరికీ సురక్షితమైన, అవగాహనతో కూడిన జీవనశైలిని అందించడమే ఈ ఏడాది దీని లక్ష్యం. ఈ ప్రచారం ద్వారా మనం ఆరోగ్యంపై దృష్టి సారించడమే కాకుండా.. మన స్వేచ్ఛా భావాలను గౌరవిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని కూడా పొందగలుగుతారు.