
Newdelhi, Feb 16: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్ లో (Delhi Railway Station) శనివారం రాత్రి భారీ తొక్కిసలాట (Stampede) సంభవించింది. ప్రయాణికుల మధ్య తోపులాట చోటుచేసుకొని అనంతరం ఈ తొక్కిసలాట జరుగడంతో 15 మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ముఖ్యంగా.. 13, 14, 15 ప్లాట్ ఫామ్ లపై మహా కుంభమేళ ప్రత్యేక రైళ్ళు ఎక్కేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పలువురు కిందపడిపోయి స్పృహ కోల్పోయారు. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
Shocking visuals of mismanagement during the Stampede-like situation at #NewDelhiRailwaystation . Delhi LG in his tweet claims 'loss of lives'. All this to attend #KumbhMela . Injured passengers are taken to LNJP hospital. pic.twitter.com/sqsPaW8Ty8
— Shivangi Saxena (@shivangi441) February 15, 2025
భయానక దృశ్యాలు
ఇప్పటికే కుంభమేళలో గతంలో మౌనీ అమావాస్య నేపథ్యంలో తొక్కిసలాట జరిగి.. 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే. తాజా ఘటనలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి సీరియస్ గా ఉంది. తొక్కిసలాట ఘటన తర్వాత స్టేషన్ లో నెలకొన్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.