
Dussehra Messages in Telugu: భారతదేశంలో హిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ నవరాత్రుల ముగింపును సూచిస్తుంది. దక్షిణ భారతదేశంలో దుర్గాదేవి మహిషాసురుడిని ఓడించినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే ఉత్తర భారతదేశంలో రావణ దహనం ద్వారా శ్రీరాముడు సాధించిన విజయాన్ని స్మరించుకుంటారు.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఈ పండుగ రోజు ఆలస్యం చేయకుండా మీ మిత్రులకు దసరా శుభాకాంక్షలు చెప్పేస్తారా మరి..
ఆ తల్లి అందరినీ కాపాడాలని.. అన్నింటా విజయాలను అందించాలని కోరుతూ.. విజయదశమి శుభాకాంక్షలు
శుభప్రదమైన విజయదశమి రోజున మీ ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలగాలని ఆశిస్తూ.. హ్యాపీ దసరా

సమస్త ప్రాణులకు.. జగజ్జనని దుర్గాదేవి ఆశీస్సులు లభించాలని కోరుతూ.. హ్యాపీ విజయ దశమి.

నవరాత్రుల పర్వదినాలు.. ప్రతి ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు అందించాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు

ధర్మ మార్గం అనుసరించి ప్రతి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ విజయ దశమి.