Hyderabad, Mar 21: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో పదుల సంఖ్యలో విద్యార్థులు కరోనా (Coronavirus) బారిన పడ్డారు. మరోవైపు సాధారణ ప్రజలు కూడా కరోనా బారీన పడుతూ ఉన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ (Covid Vaccination) ఊపందుకున్నా కేసులు మాత్రం మెల్లిగా పెరుగుతున్నాయి. అటు మహారాష్ట్ర సరిహద్దుల వద్ద పలు ఆంక్షలు కూడా విధించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ (TS Lockdown) విధించే ఆలోచన ఉందని ఓ వీడియో సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతోంది.
కరోనావైరస్‌పై త్వరలో సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని ఈ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది! తెలంగాణలో పాక్షికంగా లాక్‌డౌన్‌ను అమలు చేసే ఆలోచనలు ఉన్నట్లు, తెలంగాణలో వారాంతాల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి.. ఆయా రోజుల్లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ద్వారా తెలుస్తోంది.
అయితే ఆ వీడియో గతేడాది నాటిదని ఈ వదంతులు నమ్మవద్దని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్ (Konatham Dileep) ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. గతేడాది లాక్డౌన్ ప్రకటించిప్పటి సిఎం కెసిఆర్ యొక్క క్లిప్ ను సోషల్ మీడియాలో కొంతమంది యూజర్లు వైరల్ చేస్తున్నారు. ఈ క్లిప్ మార్చి 2020 నాటిదని దయచేసి గమనించండి. ఇటువంటి పుకార్లు నమ్మవద్దని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Here's Konatham Dileep Tweet
An old clip of CM Sri KCR announcing lockdown is being spread on Social Media by some miscreants. Please note that this clip is from March 2020
— Konatham Dileep (@KonathamDileep) March 21, 2021
తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 3.03 లక్షలకు కరోనా కేసులు చేరగా కరోనా వైరస్ తో 1,669 మంది మరణాణించారు. ప్రస్తుతం తెలంగాణలో 2,804 యాక్టివ్ కేసులు ఉండగా 2.98 లక్షల మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో 81, రంగారెడ్డి 64, మేడ్చల్‌లో 34 కరోనా కేసులు నమోదయ్యయి.
హైదరాబాదులోని పలు పాఠశాలలు, కాలేజీల్లో కరోనా కలకలం రేగుతోంది. తాజాగా హయత్ నగర్ లోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల హాస్టల్లో 37 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వసతి గృహంలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఇటీవలే విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే విద్యాసంస్థల పునఃప్రారంభం తర్వాత కరోనా వైరస్ ప్రబలుతుండడం అధికార వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.
ఇదిలా ఉంటే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైంది. గత 24 గంటల్లో 43,846 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా 22,956 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు( Coronavirus in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,755కు (Covid Deaths in India) పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,30,288 మంది కోలుకున్నారు. 3,09,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,46,03,841 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,35,65,119 కరోనా పరీక్షలు (Covid Tests) నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,33,602 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.