సాధారణంగా రైలు కదులుతున్న సమయంలో ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తొందరలో చాలామంది ఎక్కుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ట్రైన్ కదులుతున్న సమయంలో పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కడం చేస్తుంటారు. రైల్వే పోలీసులు (Railway Protection Force) ఎంత చెప్పినా వారిలో మార్పు రాదు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తిరుపతి రేల్వే స్టేషన్‌లో (Tirupati Railway Station) బుధవారం ఉదయం చేసుకుంది. ఈ వీడియో చూస్తే ఒళ్లు ఝలదరిస్తుంది.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
రైలు ప్లాట్‌ఫాంపై రైలు ఆగుతుండగానే కదులుతున్న రైలు నుంచి ఒక మహిళ హడావిడిగా దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె అదుపు తప్పి ఫ్లాట్ పాం మీద పడిపోయింది. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఆమె రైలు కింద పడిపోయేది.
ఈ విషయాన్ని గమనించిన కానిస్టేబుల్ సతీష్ (Railway Protection Force constable Satish) మెరుపు వేగంగా కదిలి ఆమెను వెనుకకు లాగారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. లేదంటే రైలుకు, ప్లాట్‌పాంకు మధ్య ఉన్న గ్యాప్ ద్వారా ఆ మహిళ రైలు పట్టాలపైకి జారి పోయి ఉండేది.
Here's CCTV Footage
Showing presence of mind, #Railway Protection Force constable Satish saved a woman from slipping into the gap between the platform and the train in #Tirupati Railway Station. The woman & her husband tried to get down from a moving train @NewIndianXpress @gsvasu_TNIE @RPF_INDIA pic.twitter.com/2wahXsT9RM
— TNIE Andhra Pradesh (@xpressandhra) May 5, 2021
మొత్తానికి మహిళ సురక్షితంగా ఉండటంతో రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సీసీ టీవీ పుటేజి చూస్తే తెలుస్తుంది. రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం దిగడం చేయడం లాంటి పనులు ెంత జాగ్రత్తగా చేయాలనేది. మీరు ఓ సారి చూసి చెప్పండి.