Patna, Jan 24: బీహార్ (Bihar) లో ఓ అవినీతి పుట్ట బద్దలైంది. అధికారుల తనిఖీల్లో కోట్ల కట్టల (Cash) పాములు బయటపడ్డాయి. ఓ అవినీతి అధికారి ఇంటిపై రైడ్ చేసిన విజిలెన్స్ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే రేంజ్ లో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. కొండలా దర్శనమిస్తున్న నోట్ల కట్టలు…ఎంత లెక్కపెట్టినా ఒడవట్లేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెట్టియా జిల్లా విద్యాశాఖాధికారి రజనీకాంత్ ప్రవీణ్ ఇంటిపై నిన్న ఉదయం విజిలెన్స్ దాడులు జరిగాయి. అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ఫిర్యాదు అందడంతో విజిలెన్స్ అధికారుల బృందం ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించింది.
Here's Video:
జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే!
బీహార్లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న రజనీకాంత్ ప్రవీణ్ బసంత్
లెక్కకు మించిన ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారంతో విజిలెన్స్ అధికారుల సోదాలు
జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్… pic.twitter.com/0Y5o9qMvqn
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2025
ఎక్కడ చూసినా డబ్బే
ఈ దాడిలో పెద్ద ఎత్తున నగలు, నగదు కుప్పలు తెప్పలుగా బయపడ్డాయి. నోట్లను లెక్కించడానికి విజిలెన్స్ బృందం స్థానిక పోలీసుల నుండి నోట్ల లెక్కింపు యంత్రాలను తీసుకొచ్చింది. రూ. 1.2 కోట్లు ఉన్నట్టు గుర్తించారు. భారీఎత్తున నగదు పట్టుబడ్డ నేపథ్యంలో ఇంటి లోపల పోలీసు బలగాలను మోహరించారు.