Jakarta, Mar 08: ఈ న్యూస్ వినడానికి చాలా చిత్రంగా ఇది నిజం, ప్రేమకు వయస్సుతో సంబంధంలేదని మరోసారి ఈ జంట రుజువు చేశారు. ఇండేనేషియాకు (indonesia) చెందిన 107 ఏళ్ల వ్యక్తి (103-Year-Old Elderly Man), అదే దేశానికి చెందిన 27 ఏల్ల యువతిని పెళ్లాడాడు. కాగా పెళ్లికి ముందే వీరు ప్రేమలో పడ్డారు. ఆ సమయంలనే శారీరకంగా ఒకటయ్యారు.
మనం లేచిపోవాలి మళ్ళీ మళ్ళీ! రెండోసారి లేచిపోయిన వరుడి తండ్రి
ఆ తర్వాత గర్భవతి అని తెలియగానే వెంటనే పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం దాదాపు 76 ఏళ్లు. పెళ్లికి వచ్చిన వారంతా వీరిద్దరి జంటని చూసి ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో (Social Media) వీరి పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.
103 ఏళ్ల ‘పుఆంగ్ కట్టే’ అనే వ్యక్తి 27 ఏళ్ల ‘ఇండో అలంగ్’ మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. ఇండోనేషియా మీడియా కథనం ప్రకారం పుఆంగ్ 1945 ఇండోనేషియా యుద్ధం సమయంలో మిలిటరీ కర్నల్‌గా పనిచేశాడు. అదే సమయంలో పొరుగున ఇండో అలంగ్ నివసిస్తూ ఉండేది.
ఇండో అలంగ్ తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడి విడిపోయినప్పుడు ఆమె తన బాధను పొరుగునే ఉన్న పుఆంగ్‌తో పంచుకుంది. ఆ సమయంలో పుఆంగ్ చూపిన ఆప్యాయతకు ఫిదా అయిన అలంగ్ అతనితో ప్రేమలో పడింది.
పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్, పెటాకులైన పెళ్లి!
ఇద్దరూ శారిరకంగా కూడా ఏకమయ్యారు. ఆ తర్వాత ఆమె గర్భవతి అని తెలియగానే లేటు వయసులో తండ్రి కాబోతున్నందుకు పుఆంగ్ సంతోషానికి హద్దులేకుండా పోయాయి. ఇద్దరు పెళ్లిచేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ సుఖంగా దాంపత్య జీవనం కొనసాగిస్తున్నారు.
షాక్ కొట్టే 9 సెకండ్ల వీడియో, అకస్మాత్తుగా ముంచెత్తిన అలలు
కాగా వధువు ఇండో అలంగ్‌కి పెళ్లికి ముందు తన భర్త వయసు 100పైగా ఉంటుదని మాత్రమే తెలుసట, కానీ ఆయనకు 103 ఏళ్ల వయసు ఉందని పెళ్లి తర్వాతే తెలిసింది. ఇక పెళ్లిలో వరుడు కన్యాశుల్కం కింద 25 వేల రూపాయల నగదుతో పాటు ఒక బంగారు ఉంగరం కూడా ఇచ్చాడు.