National Flag Was Unfurled (Credits: X)

Newdelhi, Jan 27: దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని (Republic Day) అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఛత్తీస్‌ గఢ్‌ లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం (National Flag) ఎగిరింది. అవును.. 75 ఏండ్లలో ఆ ఊళ్లో తొలిసారి రిపబ్లిక్‌ డే వేడుకలు జరిగాయి. తొలిసారిగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన ఆ గ్రామస్థుల సంబురం ఆకాశాన్ని అంటింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌ గఢ్‌ లోని సుక్మా జిల్లా తుముల్‌ పాడ్‌ గ్రామం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు. దీంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయా గ్రామాల్లో జెండా ఆవిష్కరణ అనేది జరుగలేదు.

హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది

తొలిసారిగా..

అయితే, ప్రభుత్వ అధికారులు చొరవతో.. సీఆర్‌పీఎఫ్‌ అండతో తుముల్‌ పాడ్‌ గ్రామస్థులు ఆదివారం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారత్‌ మాతాకీ జై, జై హింద్‌.. అంటూ పిల్లలు, పెద్దలు, యువకులు నినాదాలు చేశారు. సంతోషంతో స్వీట్లు పంచుకున్నారు.

ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వైఎస్ఆర్ జిల్లాలో ఘటన.. సత్యసాయి జిల్లాలో మరో ఘటన (వీడియో)