దుబాయ్‌లో(Dubai) జరుగుతున్న ఓ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత కేదార్(Producer Kedar) మృతి చెందారు. కేదార్ మృతిని ధృవీకరించారు దుబాయ్ అధికారులు. గతంలో రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో దొరికారు కేదార్. డ్రగ్స్ వల్లనే కేదార్ చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గంగం గణేశా సినిమాను నిర్మించారు కేదార్(Producer Kedar Passes Away). గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేదార్ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
ఇక మరో వార్తను చూస్తే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన ఆమెపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి.
Producer Kedar Passes Away at an Event in Dubai
గంగం గణేశా సినిమా నిర్మాత కేదార్ మృతి
గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న కేదార్ దుబాయ్‌లో మృతి pic.twitter.com/opirXvJdA2
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)