ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రెసిడెంట్‌ రాబే హసానీ నద్వి(94) అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నద్విని చికిత్స కోసం రాయ్‌బరేలీ నుంచి లక్నోకు తరలించారు. అయితే దాలిగంజ్‌లోని నద్వా మదరాసాకు ఆయన్ని తరలించగా.. అక్కడే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. సున్నీ ఇస్లామిక్‌ స్కాలర్‌ అయిన నద్వి.. ముస్లిం విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం విశేష కృషి చేశారు.

ఉత్తర ప్రదేశ్‌ రాయ్‌బరేలీ టాకియా కలాన్‌లో జన్మించిన రబే హసానీరాబే హసానీ నద్వి.. 2018 నుంచి ఏఐఎంపీ చీఫ్‌గాను పని చేస్తూ వచ్చారు. దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమా ఛాన్సలర్‌గా పని చేశారు. విద్యా రంగానికి నద్వి అందించిన సేవలకు మంచి పేరు దక్కింది. యూపీ ప్రభుత్వం నుంచి పలు ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు అరబిక్‌ భాషకు, సాహిత్యానికి చేసిన కృషికిగానూ రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. నద్వి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.

Here's AIMPLB Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)