రాజ‌స్థాన్‌లోని బ‌ర్మేర్‌-జోధ్‌పూర్ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదంలో (Barmer Road Accident) మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రూ.2 ల‌క్ష‌ల చొప్పున ( PM Narendra Modi announces ₹2 lakh ex-gratia ) ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి కూడా రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం ట్విట్ట‌ర్‌లో ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

ప్ర‌ధాన‌మంత్రి నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్‌) నుంచి ఈ నిధుల‌ను అందించనున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ఉద‌యం రాజ‌స్థాన్‌లోని బ‌ర్మేర్ జిల్లాలో బ‌ర్మేర్‌-జోధ్‌పూర్ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు, ఆయిల్ ట్యాంక‌ర్ ఎదురెదురుగా ఢీకొన‌డంతో పెద్దఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మ‌ర‌ణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Here's PMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)