కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో (Bengaluru city) శుక్రవారం వర్షం పడింది. దీంతో సిలికాన్‌ సిటీ వర్షంతో తడిసిముద్దైంది. కొన్ని ప్రాంతాల్లో ఊదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు తాజాగా కురిసిన తేలికపాటి వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించినట్లైంది. గురువారం కూడా నగరంలో వర్షం పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నగర ప్రజలు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ‘బెంగళూరులో ఎట్టకేళకు వర్షం కురిసింది..’, ‘ఈ వర్షంతో ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది’ అంటూ వీడియోలకు క్యాప్షన్‌ ఇచ్చారు.  6వ తేదీ తర్వాత వాతావరణం చల్లబడుతుందని తెలిపిన ఐఎండీ, నిప్పుల కుంపటిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు, ఏకంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు

Here's Rain Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)