ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటు చేసుకుంది. బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ( Dantewada Bijapur border) చోటు చేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు (Naxalites) హతమయ్యారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న ముందస్తు సమాచారంతో భద్రతా బలగాలు (soldiers) ఆపరేషన్‌ ప్రారంభించాయి. సోదాల సమయంలో భద్రతా బలగాలకు మావోలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకూ 9 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  ఇంకా ముప్పు పోలే.. ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న మరో తుఫాను గండం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)