ఒక ముఖ్యమైన తీర్పులో, భారత సుప్రీంకోర్టు మైనర్ బాలిక ప్రైవేట్ భాగాలను తాకడం మాత్రమే జరిగితే, దానిని అత్యాచారం లేదా చొచ్చుకుపోయే లైంగిక దాడిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లక్ష్మణ్ జాంగ్డే నిందితుడు. మొదట దిగువ కోర్టు అతన్ని మైనర్‌పై అత్యాచారం చేసినందుకు, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద దోషిగా నిర్ధారించి కఠిన శిక్ష విధించింది. అయితే, అన్ని సాక్షాలు, వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం, సుప్రీంకోర్టు వాస్తవానికి నిందితుడు బాలిక ప్రైవేట్ భాగాలను మాత్రమే తాకాడని, చొచ్చుకుపోయే చర్య జరగలేదని తేల్చింది. దాంతో, “ప్రైవేట్ భాగాలను తాకడం తీవ్రమైన చర్యే అయినప్పటికీ, అది అత్యాచారం కింద రాదు” అని జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తండ్రి ఎక్కువ డబ్బు సంపాదించినా పిల్లల సంరక్షణపై తల్లికే హక్కు.. పిల్లల కస్టడీ కేసులో జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు..

కోర్టు ప్రకారం, ఈ నేరం భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 354 (స్త్రీ అణకువను అవమానించడం), పోక్సో చట్టంలోని సెక్షన్ 10 (తక్కువ తీవ్రమైన లైంగిక నేరం) కింద వస్తుందని నిర్ణయించింది. అందువల్ల, లక్ష్మణ్ జాంగ్డేకు విధించిన శిక్షను తగ్గించి, ఐపీసీ సెక్షన్ 354 కింద ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను, పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను మాత్రమే కొనసాగించింది. ముందుగా అతనిపై సెక్షన్ 376 ఎబి (అత్యాచారం), పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద శిక్ష పడింది. అయితే, సుప్రీంకోర్టు ఆ తీర్పును సవరించి, నేర స్వభావాన్ని తక్కువ తీవ్రత కలిగిన లైంగిక నేరంగా పరిగణించింది.

Touching Minor's Private Parts Not Rape or Penetrative Sexual Assault

 

View this post on Instagram

 

A post shared by LawBeat (@lawbeatind)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)