ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ నెల ప్రారంభంలొ వరదలు ముంచెత్తిన సంగతి విదితమే.దాని నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. అయితే ఈ విపత్తు నుంచి తేరుకోకముందే మరో తుఫాను హెచ్చరిక ఏపీ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబు­తున్నారు.

విజయవాడ వరదలు మరిచిపోకముందే ఏపీకి మరో తుపాన్‌ ముప్పు, ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు

ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24న ఏర్పడే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొ­న్నారు. తుపానుగా మారితే.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకా­శాలుంటాయని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభా­వంతో 20 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పారు.

Cyclonic Circulation Likely To Form Over Bay of Bengal: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)