ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఐపీఎల్‌ 2022లో బిజీగా ఉన్న వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో వార్నర్‌ ఇద్దరు కూతుర్లు ఇవీ మే, ఇండీ రేలు ఎమోషనల్‌ అయినట్లు కనిపించింది. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 66 పరుగులతో రాణించిన వార్నర్ ఔటవ్వగానే వారు ఏడుస్తూ కనిపించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 16 పరుగుల తేడాతో ఓటమి పాలయింది.

వార్నర్‌ పెద్ద కూతురు ఇవీ మే నాన్న ఔటయ్యాడని గుక్కపట్టి ఏడ్వగా.. ఇండీ రే మాత్రం మనుసులోనే బాధపడింది. వార్నర్‌కి ఇది బాధ కలిగించినా ఒక విషయంలో మాత్రం సంతోషంగా అనిపించిందంటూ రాసుకొచ్చాడు. నా ఇద్దరు కూతుర్లకు ఆట అంటే ఏంటో అర్థమవుతుంది.నేను ఔట్‌ అయ్యానన్న విషయాన్ని జీర్ణించుకోలేక బాగా ఫీల్‌ అయ్యారు. ఇలాంటి కూతుర్లు ఉండడం నా అదృష్టం.

చిన్నప్పటి నుంచే వాళ్లు ఆట గురించి తెలుసుకుంటున్నారు. ఇక ప్రతీసారి మనమే గెలవాలని రాసి పెట్టి ఉండదు. మైదానంలో అడుగుపెట్టేముందు మ్యాచ్‌లో వంద శాతం ఎఫర్ట్‌ చూపించాలని అనుకుంటాం. ఒకసారి కలిసొస్తుంది.. ఇంకోసారి బెడిసికొడుతుంది. ఈ విషయాన్ని నా ఇద్దరు కూతుర్లకు అర్థమయ్యేలా చెప్పాలి'' అంటూ ముగించాడు.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)