చెల్లూరులో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగం అనంతరం విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు స్వయంగా పరిచయం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం, ఎచ్చెర్ల అభ్యర్థులు కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, తలే రాజేష్​​, బొత్స అప్పలనరసయ్య, గొర్లె కిరణ్‌కుమార్‌లను ప్రజలకు పరిచయం చేసి సౌమ్యులు, పరిపాలనాదక్షులైన వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయి,చెల్లూరు మేమంతా సిద్ధం సభలో ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగిన సీఎం జగన్

అందులో భాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణను పరిచయం చేసినప్పుడు ప్రజల హర్షధ్వానాలు పెద్ద ఎత్తున మిన్నంటాయి. ఆ సమయంలోనే మంత్రి బొత్సను ప్రత్యేకంగా తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరినప్పుడు జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యం చూసిన ప్రజలు, అభిమానులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)