Secunderabad, July 9: సికింద్రాబాద్‌లో (Secunderabad) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పాలికాబజార్ లోని (Palika bazar) ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాప్ మొత్తానికి విస్తరించడటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఓ ఆయుర్వేదిక్ దుకాణం (Ayurvedic shop) నుంచి మంటలు వ్యాపించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Telangana: Massive fire breaks out in 3 shops in Palika Bazar, Secunderabad. Fire tenders present at the spot. No casualties reported pic.twitter.com/dkE3JCiWWJ
— ANI (@ANI) July 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)