తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం ఇచ్చే అవార్డులతోపాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని సినీ పెద్దలు చెప్పారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

 బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు..కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదుతో నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు, పలె సెక్షన్ల కింద కేసు నమోదు

తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించింది ఫిల్మ్ ఛాంబర్. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల భేటీ, తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

 Telugu Film Chamber takes key decision

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)