Bareddy Anusha: టీమిండియాకు సెలక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ క్రికెటర్ బారెడ్డి అనూష, బంగ్లాదేశ్‌ టోర్నీలో భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం
Bareddy Anusha (photo-Twitter)

అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడ్డి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.ఎడమ చేతి స్పిన్నర్‌, బ్యాటర్‌ అయిన అనూష 2014లో అనంతపురం ఆర్డీటీ అకాడమీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి టీంఇండియాకు సెలక్ట్ అయంది. ఈమె తల్లిదండ్రులు బి.లక్ష్మీదేవి, మల్లిరెడ్డి. సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు.

కాగా బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్‌ జట్టును ఆదివారం ప్రకటించారు. గాయంతో పేసర్‌ రేణుక సింగ్‌ దూరం కాగా, వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ను ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (టి20, వన్డే) పక్కనబెట్టారు. యువ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశమివ్వలేదు. బంగ్లాదేశ్‌తో భారత్‌ మూడేసి టి20లు, వన్డేలు ఆడుతుంది. ముందుగా మిర్పూర్‌ వేదికగా ఈనెల 9, 11, 13 తేదీల్లో టి20 మ్యాచ్‌లు, అదే స్టేడియంలో 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి.

ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ భారత్ సొంతం, ఫైనల్‌లో ఇరాన్‌ను చిత్తుగా ఓడించిన ఇండియా

టి20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి (వైస్‌ కెప్టెన్‌), దీప్తిశర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, హర్లీన్‌ డియోల్, దేవిక వైద్య, ఉమా చెట్రి, అమన్‌జోత్‌ కౌర్, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ, మేఘన సింగ్, మోనిక పటేల్, రాశి కనోజియా, అనూష బారెడ్డి, మిన్నురాణి.

వన్డే జట్టులో సబ్బినేని మేఘన, మిన్నురాణి స్థానాల్లో ప్రియా పూనియా, స్నేహ్‌ రాణాలను తీసుకున్నారు.