Virat Kohli (Photo Credits: IANS)

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా రెండు ఘోరమైన పరాభవాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో జీర్ణించుకోలేని భారత్ క్రికెట్ అభిమానులు జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా దాడులు చేస్తున్నారు. పాకిస్థాన్ చేతిలో పరాజయం తర్వాత పేసర్ మహమ్మద్ షమీని టార్గెట్ చేసిన నెటిజన్లు.. న్యూజిల్యాండ్ చేతిలో కూడా టీమిండియా ఓడిపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీని (Online Threats to Kohli’s Family) టార్గెట్ చేయడం ప్రారంభించారు.

అతనితోపాటు కోహ్లీ భార్య అనుష్క శర్మ, 9 నెలల కుమార్తె వామికపై కూడా అసభ్యకర కామెంట్లు (online threats to Virat Kohli’s family) చేస్తున్నారు. కొంతమంది ఆ పాప ఫొటోల కోసం ఎదురు చూస్తున్నామని, అవి బయటపడినతర్వాత ఆ పాపపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు దిగారు.

వీటిపై ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయింది. ఈ బెదిరింపులను సుమోటోగా తీసుకుంది. ఈ వార్తలపై ఢిల్లీ మహిళా కమిషన్ నవంబర్ 2న ఢిల్లీ నగర పోలీసులకు నోటీసులు (DCW notice to Delhi Police ) పంపింది.ఢిల్లీ మహిళా ప్యానెల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్)కి ఈ నోటీసు పంపింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటి నుంచి కోహ్లి తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేస్తానని ఆన్‌లైన్‌లో బెదిరింపులు వస్తున్నాయని ఈ నోటీసులో పేర్కొన్నారు.

కోహ్లీకి అండగా నిలబడిన రాహుల్ గాంధీ, విమర్శించేవారిని క్షమించు.. జట్టును రక్షించండి అంటూ ట్వీట్

ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీని సమర్పించాలని మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులను కోరింది. ఈ కేసులో గుర్తించి అరెస్టు చేసిన నిందితుల వివరాలను కోరింది. నిందితులను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను కూడా కమిషన్ అడిగింది. డీసీడబ్ల్యూ చీఫ్ ఈ విషయంలో సవివరమైన చర్యలు తీసుకున్న నివేదికను కూడా కోరారు. నవంబర్ 6 నాటికి మాకు దీనిపై తగిన సమాచారాన్ని అందించాలని DCW chairperson Swati Maliwal కోరారు.

ఇదిలా ఉంటే టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీల‌పై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మండిప‌డ్డారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కివీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా ఓడిన త‌ర్వాత జ‌రిగిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌కు ర‌విశాస్త్రి, కోహ్లీలు హాజ‌రుకాలేదు. అయితే ఈ అంశంపై ఓ మీడియా ఛాన‌ల్‌తో మాట్లాడుతూ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ర‌విశాస్త్రి లేదా కోహ్లీ .. మీడియా స‌మావేశానికి హాజ‌రు కావాల్సి ఉండాల్సింది అన్నారు. అయితే ఆ స‌మావేశానికి స్పీడ్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా హాజ‌రుకావ‌డాన్ని అజారుద్దీన్ త‌ప్పుప‌ట్టారు. ఇది ఏర‌కంగా ఆమోద్య‌యోగం కాద‌న్నారు.

ఏదైనా అద్భుతం జరిగితేనే భారత్‌కు సెమీఫైనల్ అవకాశాలు, ఊపుమీదున్న ఆప్ఘాన్ ఆ ఛాన్స్ ఇస్తుందా, టీమిండియా సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం

నా అభిప్రాయంలో హెడ్ కోచ్ మీడియా స‌మావేశానికి హాజ‌రుకావాలి, ఒక‌వేళ విరాట్ హాజ‌రుకావాల‌ని లేకుంటే దాంతో స‌మ‌స్య లేదు. కానీ కోచ్ ర‌విశాస్త్రి మాత్రం క‌చ్చితంగా ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌కు హాజ‌రుకావాల్సి ఉంద‌ని అజార్ అన్నారు. మ్యాచ్‌లు గెలిస్తేనే ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ల‌కు హాజ‌రుకావ‌డం కాదు, ఓట‌మి ప‌ట్ల కూడా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని, బుమ్రాను ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌కు పంప‌డం స‌రికాదన్నారు. కెప్టెన్ లేదా కోచ్ మీడియా స‌మావేశానికి రావాల‌ని, క‌నీసం కోచింగ్ స్టాఫ్‌లో ఎవ‌రో ఒక‌రు ఉండాల‌న్నారు.

కోహ్లీ, శాస్త్రిలు మీడియా నుంచి ప్ర‌శ్న‌లు ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా లేర‌ని జ‌ర్న‌లిస్టు వేసిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ఓట‌మి ప‌ట్ల సిగ్గు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అజార్ అన్నారు. కానీ ఎవ‌రో ఒక‌రు బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. ఒక‌టి లేదా రెండు మ్యాచ్‌లు ఓడిపోతే సిగ్గుప‌డాల్సింది ఏమీ లేద‌ని, కానీ కెప్టెన్ లేదా కోచ్ ఓట‌మి ప‌ట్ల వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు. ఆ ప్ర‌శ్న‌ల‌కు బుమ్రా నుంచి స‌మాధానం ఆశించ‌లేమ‌న్నారు.