నేటి నుంచి ఐపీఎల్ పండగ మొదలు కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నడవనుంది. రాత్రి 7:30 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో GT Vs CSK మధ్య తొలిపోరుతో ఐపీఎల్ ప్రారంభం కానుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత ఛాంపియన్‌గా నిలిచింది.
గత సీజన్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత ఏడాది గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన సీజన్‌ను కలిగి ఉంది, వారు 14 లీగ్ గేమ్‌లలో 10 మ్యాచ్‌లను గెలుచుకున్నారు. గత సీజన్‌లో, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా జట్టు బ్యాటింగ్‌తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.
ఈ సంవత్సరం కూడా వారు జట్టులో ప్రధాన పాత్ర పోషించనున్నారు.పాండ్యా టీమ్‌లో ఓపెనర్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి విలియమ్సన్ కూడా చేరాడు. తొలి మ్యాచ్‌కు డేవిడ్ మిల్లర్ దూరం కానుండగా స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో ప్రత్యర్థికి తిప్పలు తప్పవు. పేసర్లు షమి, మావి, అల్జారి జోసెఫ్ కీలకం కానున్నారు.
ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది ఐపీఎల్ చరిత్రలో చెత్త సీజన్‌ను ఎదుర్కొంది. 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన తర్వాత IPL 2022 స్టాండింగ్‌లలో వారు తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఈ సీజన్‌లో MS ధోనీ మొదటి నుండి జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. తిరిగి పోరాడాలని చూస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు జట్టుపై భారీ ప్రభావం చూపుతారు. ధోనీకిదే చివరి సీజన్‌గా చెప్పుకొంటున్నారు.
జట్టులోని ఖరీదైన ఆటగాడు బెన్ స్టోక్స్ తమ బ్యాటింగ్ బలాన్ని పెంచుతాడని ఆశిస్తోంది. కాన్వే, మొయిన్ అలీ, జడేజా, రాయుడు కూడా సత్తా చాటితే భారీ స్కోర్లు ఖాయమే. ఆంధ్ర యువ క్రికెటర్ రషీద్‌ను చెన్నై కొనుగోలు చేసింది. బౌలింగ్ నుంచి దీపక్ చాహర్, సిమ్రన్‌జిత్, స్పిన్నర్ తీక్షణ కీలకం కానున్నారు.
పూర్తి స్క్వాడ్:
గుజరాత్ జెయింట్స్: హార్దిక్ పాండ్యా (సి), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మోహిత్ శర్మ, కెఎస్ భరత్, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, ఓడియన్ స్మిత్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ , అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్. సాయి కిషోర్, నూర్ అహ్మద్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్.
చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (సి), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాన్ట్‌నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, మఠీ సింగజేత్, ముఖేష్ చౌదరి సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, కైల్ జేమీసన్, అజయ్ మండల్, భగత్ వర్మ.