IPL 2022: చెన్నై బౌలర్లను ఊచకోత కోసిన రషీద్‌ ఖాన్, గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం, పాయింట్ల పట్టికలో టాప్‌లో దూసుకుపోతున్న టైటాన్స్
David Miller (Photo Credits; Twitter/IPL)

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో.. గుజరాత్‌ టైటాన్స్‌ను విజయం వరించింది. డేవిడ్‌ మిల్లర్‌ (51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 94 నాటౌట్‌) దూకుడుకు.. రషీద్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) విధ్వంసం తోడవడంతో.. ఐపీఎల్‌లో (IPL 2022) ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై నెగ్గింది. తొలుత చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 169/5 స్కోరు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (48 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 73), రాయుడు (31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) రాణించారు. జోసెఫ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

లక్ష్యఛేదనలో గుజరాత్‌ 19.5 ఓవర్లు 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి గెలిచింది. బ్రావో 3 వికెట్లు దక్కించుకున్నాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా మిల్లర్‌(David Miller Shines) నిలిచాడు. హార్దిక్‌ పాండ్యా గాయంతో బరిలోకి దిగకపోవడంతో రషీద్‌ఖాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ ఈ మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రిస్‌ జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18 వ ఓవర్‌లో రషీద్‌ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన దశలో రషీద్‌ ఖాన్‌ జోర్డాన్‌ వేసిన ఓవర్లో తొలి నాలుగు బంతులను 6,6,4,6గా మలిచి 22 పరుగులు పిండుకున్నాడు.

దడ పుట్టిస్తున్న సన్‌రైజర్స్‌, వరుసగా నాలుగో విక్టరీ నమోదు చేసి టాప్‌-4లోకి, పంజాబ్‌ కింగ్స్‌ను ఏడు వికెట్లతో చిత్తుచేసిన హైదరాబాద్

ఓవరాల్‌గా ఆ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బ్రావో వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో మరో బౌండరీ బాదిన రషీద్‌ ఖాన్‌.. అదే ఓవర్‌ ఐదో బంతికి మొయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అలా 21 బంతుల్లో 40 పరుగుల రషీద్‌ విధ్వంసానికి తెరపడింది. కాగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు హార్దిక్‌ పాండ్యా దూరంగా ఉండడంతో.. రషీద్‌ ఖాన్‌ స్టాండిన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

చెన్నై సూపర్‌ కింగ్స్‌:రుతురాజ్‌ గైక్వాడ్‌ (సి) మనోహర్‌ (బి) యశ్‌ దయాల్‌ 73, రాబిన్‌ ఊతప్ప (ఎల్బీ) షమి 3, మొయిన్‌ అలీ (బి) జోసెఫ్‌ 1, అంబటి రాయుడు (సి) శంకర్‌ (బి) జోసెఫ్‌ 46, శివమ్‌ దుబే (రనౌట్‌) మిల్లర్‌/ఫెర్గుసన్‌ 19, రవీంద్ర జడేజా (నాటౌట్‌) 22, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 169/5. వికెట్ల పతనం: 1-7, 2-32, 3-124, 4-131, 5-169. బౌలింగ్‌: మహ్మద్‌ షమి 4-0-20-1, యశ్‌ దయాల్‌ 4-0-40-1, జోసెఫ్‌ 4-0-34-2, ఫెర్గుసన్‌ 4-0-46-0, రషీద్‌ ఖాన్‌ 4-0-29-0.

గుజరాత్‌ టైటాన్స్‌:వృద్ధిమన్‌ సాహా (సి) గైక్వాడ్‌ (బి) జడేజా 11, శుభమ్‌ గిల్‌ (సి) ఊతప్ప (బి) ముకేష్‌ 0, విజయ్‌ శంకర్‌ (సి) ధోనీ (బి) తీక్షణ 0, అభినవ్‌ మనోహర్‌ (సి) అలీ (బి) తీక్షణ 12, డేవిడ్‌ మిల్లర్‌ (నాటౌట్‌) 94, రాహుల్‌ తెవాటియా (సి) జడేజా (బి) బ్రావో 6, రషీద్‌ ఖాన్‌ (సి) అలీ (బి) బ్రావో 40, జోసెఫ్‌ (సి) జోర్డాన్‌ (బి) బ్రావో 0, ఫెర్గుసన్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 19.5 ఓవర్లలో 170/7. వికెట్ల పతనం: 1-1, 2-2, 3-16, 4-48, 5-87, 6-157, 7-157. బౌలింగ్‌: ముకేష్‌ చౌధురి 3-0-18-1, మహేష్‌ తీక్షణ 4-0-24-2, క్రిస్‌ జోర్డాన్‌ 3.5-0-58-0, రవీంద్ర జడేజా 3-0-25-1, మొయిన్‌ అలీ 2-0-17-0, బ్రావో 4-1-23-3