Suryakumar Yadav Catch Video

బార్బ‌డోస్ వేదిక‌గా జూన్ 29న జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌ను ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు.ఐసీసీ టోర్నీలో తొలిసారి ఫైన‌ల్ చేరి.. మొద‌టి ట్రోఫీని ముద్దాడ‌కుండానే ఇంటిదారి ప‌ట్టిన ఆ రోజును డేవిడ్ మిల్ల‌ర్ ఇప్ప‌టికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా మిల్ల‌ర్ ఆ ఫైన‌ల్ ఓవ‌ర్‌ను గుర్తు చేసుకున్నాడు. ఆరోజు సూర్య‌కుమార్ యాద‌వ్ ప‌ట్టిన అద్భుత క్యాచ్‌తో అంతా త‌ల‌కిందులు అయింద‌ని చెప్పాడు.

తొలిసారి ప్రపంచకప్ ముద్దాడలన్న సఫారీల కలను దూరం చేసింది ఇదే, ఆ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ పట్టి ఉండకపోతే, డేవిడ్ మిల్లర్ చేతిలో..

ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో క్రికెట్ మంత్లీ షోలో మాట్లాడిన మిల్ల‌ర్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆఖ‌రి ఓవర్ గురించి ప‌లు విష‌యాలు వెల్ల‌డించాడు. ఈ సంద‌ర్భంగా త‌న వ‌ల్లే దేశం త‌ల‌దించుకోవాల్సి వ‌చ్చింద‌ని అత‌డు వాపోయాడు. ‘ఆ రోజును మాట‌ల్లో వ‌ర్ణించ‌లేను. వ‌ర‌ల్డ్ క‌ప్ ఓటమిని త‌ల‌చుకుంటేనే ప‌ట్ట‌లేనంత కోపం, చిరాకు, నిరాశ‌, వైఫ‌ల్యం.. ఇవ‌న్నీ న‌న్ను చుట్టుముడుతాయి.ఆరోజు నేను మా జ‌ట్టును గెలిపించాల్సింది. కానీ, నేను మా దేశం త‌లొగ్గేలా చేశాను. మా జ‌ట్టు స‌భ్యుల‌ను త‌ల‌దించుకునేలా చేశాను. అందుక‌నే ఆరోజు క్యాచ్ అవుట్ అయినా స‌రే మైదానం వీడొద్ద‌ని అనుకున్నా’ అని మిల్ల‌ర్ తెలిపాడు.

Here's News

తొమ్మిదో సీజ‌న్‌లో మ‌ర్క్‌ర‌మ్ సార‌థ్యంలోని ద‌క్షిణాఫ్రికా తొలి ఐసీసీ ట్రోఫీ కొట్టేస్తుంద‌నుకుంటే మ‌ళ్లీ ఒత్తిడితో కుదేలైంది. కింగ్స్‌ట‌న్ ఓవ‌ల్‌లో జూన్ 29న‌ భార‌త బౌల‌ర్ల ధాటికి ద‌క్షిణాఫ్రికా 7 ప‌రుగుల తేడాతో ఓడింది. టీమిండియా నిర్దేశించిన 176 ప‌రుగుల ఛేద‌న‌లో హెన్రిచ్ క్లాసెన్(52), డేవిడ్ మిల్ల‌ర్‌(21)ల‌ మెరుపుల‌తో ప‌టిష్ట‌స్థితిలో నిలిచిన స‌ఫారీ జ‌ట్టు అనూహ్యంగా త‌డ‌బ‌డి ఓటమి పాలైంది.