India beat Netherlands (Photo-Twitter)

టీ20 వరల్డ్‌కప్‌-2022 సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 27) భారత్‌-నెదర్లాండ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. 56 పరుగుల తేడాతో భారత్ విజయకేతనం ఎగరవేసి సెమీస్ అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు ​కోల్పోయి 179 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(62 నాటౌట్‌), రోహిత్‌ శర్మ(53), సూర్యకుమార్‌ యాదవ్‌(51 నాటౌట్‌) అర్ద సెంచరీలతో చెలరేగారు. మరో స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఇక నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్ మీకెరెన్, క్లాసన్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ బ్యాటర్లు ఏ మాత్రం ప్రభావం చూసలేకపోయారు. మొత్తం 20 ఓవర్లు ఆడిన నెదర్లాండ్స్ బ్యాటర్లు 123 పరుగులు చేశారు. 56 పరుగుల తేడాతో  ఓడిపోయింది.

ఈ ఏడాది ప్రపంచకప్‌లో తొలి సెంచరీ, 56 బంతుల్లో 109 పరుగులు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌ రిలీ రోసో, బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోసిన రోసో

భారత బౌలర్లలో భువనేశ్వర్‌, హర్షదీప్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఈ విక్టరీతో గ్రూప్‌ 2లో ఇండియా నాలుగు పాయింట్లతో ప్రస్తుతం టాప్‌లో నిలిచింది. ఒక గ్రూపు నుంచి టాప్‌ రెండు జట్లు మాత్రమే సెమీస్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే.

ఇంగ్లండ్ కొంప ముంచిన వర్షం, 5 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఐర్లాండ్‌, తలలు బాదుకుంటున్న ఇంగ్లండ్‌ ప్లేయర్లు

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో టీమిండియా అరుదైన రికార్డు సాధించింది.  నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు అర్థశతకాలతో మెరిశారు. టి20 ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్‌లో టీమిండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు అర్థసెంచరీలు సాధించడం ఇది రెండోసారి కాగా.. ఓవరాల్‌గా మూడోసారి. ఇంతకముందు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఈ ఫీట్‌ సాధించింది. ఆ తర్వాత 2016 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా ముగ్గురు బ్యాటర్లు అర్థసెంచరీలు చేశారు. తాజాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా నుంచి రోహిత్‌, కోహ్లి, సూర్యకుమార్‌లు ఈ ఫీట్‌ను సాధించారు.