IPL 2022: మరో మూడేళ్లు చెన్నైతోనే ధోనీ, ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదంటున్న చెన్నై సూపర్ కింగ్స్, ఫ్రాంచైజీలు నవంబర్ 30లోపు రిటెన్షన్ జాబితా అందజేయాలని బీసీసీఐ పిలుపు
Mahendra Singh Dhoni (Photo Credits: Getty Images)

అంతర్జాతీయ క్రికెట్‌కు బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీనికి ఆయన ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇస్తున్నాయి.

చెన్నై చెపాక్ మైదానంలోనే చివరి ఐపీఎల్ (IPL) మ్యాచ్ ఆడతానని చెప్పడం..అంతలోనే బీసీసీఐ రిటెన్షన్ పాలసీపైనే (BCCI Retention Policy) తాను లీగ్ కొనసాగేది ఆధారపడి ఉందని చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల మధ్య సీఎస్‌కే ఫ్రాంచైజీ.. ఎట్టి పరిస్థితుల్లో ధోనీని వదులుకోమని, రిటెన్షన్ జాబితాలో (CSK likely to retain MS Dhoni for three seasons) అతనే ముందుంటాడని తెలిపింది. తాజా సమాచారం ప్రకారం ధోనీ ఒక్క ఏడాదే కాకుండా మరో మూడేళ్ల పాటు ఆడనున్నాడని తెలుస్తోంది. వచ్చే మూడేళ్లు అతను (Mahendra Singh Dhoni) చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉంటాడని తెలుస్తోంది.

ఇక వచ్చే ఏడాది కొత్త రెండు జట్లు వస్తుండటంతో టీమ్స్ సంఖ్య పదికి పెరగనుంది.ఇప్పటికే కొత్త జట్ల ప్రక్రియను ముగించిన బీసీసీఐ మెగా వేలం నిర్వహణపై దృష్టి సారించింది. డిసెంబర్‌ చివరి వారంలో మెగా ఆక్షన్ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కొత్తగా వచ్చిన జట్లలో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది. మెగావేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని సిద్దం చేసిన బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఫ్రాంచైజీలకు సమాచారమిచ్చింది. నవంబర్ 30లోపు తమ రిటెన్షన్ జాబితాను అందజేయాలని ఫ్రాంచైజీలకు సూచించింది.

సౌతాఫ్రికాకు. ఆర్సీబీకి షాక్, అన్ని పార్మాట్లకు గుడ్ బై చెప్పేసిన ఏబీ డివిలియర్స్, ఆడాలన్న కసి తగ్గిపోయిందని ట్వీట్

ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీని మరో మూడేళ్లు ఆడించనుంది. అలాగే రుతురాజ్‌ గైక్వాడ్‌, రవీంద్ర జడేజాతో పాటు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్లు మొయిన్‌ అలీ లేదా సామ్‌ కరన్‌.. ఇద్దరిలో ఒకరిని తమవద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా‌కు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి.