Dinesh Karthik Helps Royal Challengers Bangalore Register Second Successive Win

ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్ దినేష్ కార్తీక్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడని కార్తీక్ తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. 18 బంతుల్లో 22 పరుగులు చేసిన కార్తీక్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫినిష‌ర్ పాత్ర‌కు న్యాయం చేయ‌ని దినేష్ కార్తీక్ రికార్డుల‌కు మాత్రం కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్, గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రనౌట్‌లు అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా దినేష్ కార్తీక్ నిలిచాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో సుయాష్ శర్మ వేసిన బంతిని డీప్ కవర్ల దిశగా కార్తీక్ ఆడాడు. సింగిల్ పూర్తి చేసిన తర్వాత, కార్తీక్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల సుయాష్‌ ప్రభుదేశాయ్‌ ఆలస్యంగా స్పందించాడు. అప్పటికే బంతిని అందుకున్న అనుకుల్‌ రాయ్‌ సుయాష్‌కు త్రో వేయగా..అతను వికెట్లను గిరాటేశాడు. దీంతో ప్రభుదేశాయ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

అభిమానికి వచ్చిన కాల్‌ లిఫ్ట్ చేసి మాట్లాడిన రాజస్థాన్ కెప్టెన్, ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటుండగా ఆసక్తికర ఘటన

ఈ క్రమంలోనే దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌ చరిత్రలో 39వ రనౌట్‌లో పాలుపంచుకున్నాడు. కార్తిక్‌ తర్వాతి స్థానంలో 37 రనౌట్లతో రోహిత్‌ రెండో స్థానంలో ఉండగా.. 35 రనౌట్లతో ధోని మూడో స్థానంలో, 30 రనౌట్లతో రాబిన్‌ ఊతప్ప, సురేశ్‌ రైనాలు సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు.