ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య పోరు ఫ్యాన్స్‌కు విందు భోజనం అందించింది. బుధవారం జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో (IPL 2022) లక్నో 2 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన రెండో కొత్త జట్టుగా లక్నో నిలువగా, నిరుటి రన్నరప్ కోల్‌కతా తమ ప్రస్థానాన్ని ( Kolkata Get Eliminated) ముగించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో క్వింటన్ డికాక్ ( Quinton de Kock Shines With Century) రికార్డులు కొల్లగొట్టగా, కేఎల్ రాహుల్ సహాయక పాత్రలో నిలిచాడు. వీరిద్దరి జోరుతో 2022 సీజన్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ సగర్వంగా ‘ప్లే ఆఫ్స్’లోకి అడుగు పెట్టింది.
ముందుగా లక్నో 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (70 బంతుల్లో 140 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ సెంచరీకి రాహుల్ (51 బంతుల్లో 68; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ తోడైంది. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్ రాణా (22 బంతుల్లో 42; 9 ఫోర్లు), రింకూ సింగ్ (15 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్యామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.
లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 208/8 స్కోరు చేసింది. శ్రేయాస్ అయ్యర్(50), నితీశ్ రాణా(42), రింకుసింగ్(40) రాణించినా లాభం లేకపోయింది. ఆఖర్లో రింకుసింగ్, సునీల్ నరైన్(21 నాటౌట్) మెరుపులతో ఒక దశలో కోల్‌కతా గెలుపుపై ఆశలు రేగినా..లెవిస్ అద్భుత క్యాచ్‌తో మ్యాచ్ లక్నో వైపునకు తిరిగింది.
ఈ మ్యాచ్‌లో డికాక్-రాహుల్ విధ్వంసం ధాటికి చాలాకాలంగా పదిలంగా ఉన్న పలు రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఇద్దరూ వ్యక్తిగతంగానూ, అలాగే ఓపెనింగ్ జోడీగా పలు కొత్త రికార్డులు నమోదు చేశారు.
1. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్‌కు అజేయమైన 210 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన డికాక్-రాహుల్ జోడీ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామాయన్ని నెలకొల్పారు. ఈ రికార్డు గతంలో సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో-డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. 2019లో ఈ జోడీ తొలి వికెట్‌కు 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అంతకుముందు 2017 సీజన్‌లో కేకేఆర్ ఓపెనర్లు గౌతం గంభీర్-క్రిస్ లిన్‌లు తొలి వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
2. ఐపీఎల్ చరిత్రలోనే 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉన్న ఏకైక జోడీగా డికాక్-రాహుల్ జోడీ రికార్డుల్లోకెక్కింది. లీగ్ చరిత్రలో ఏ జోడీ కూడా మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేదు.
3. డికాక్-రాహుల్ జోడీ కేకేఆర్‌పై అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని (అజేయమైన 210 పరుగుల) నెలకొల్పింది. 2017లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్-శిఖర్ ధవన్‌లు తొలి వికెట్‌కు 139 పరుగులు జతచేశారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కేకేఆర్‌పై ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం.
4. ఐపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కైనా మూడో అత్యుత్తమ భాగస్వామ్యం..
- కోహ్లి-డివిలియర్స్ (229) ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్ (2016)
- కోహ్లి-డివిలియర్స్ (215) ఆర్సీబీ వర్సెస్ ముంబై (2015)
- డికాక్-రాహుల్ (210) లక్నో వర్సెస్ కేకేఆర్ (2022)
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ టైటాన్స్ X బెంగళూరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో.