ఐపీఎల్ 2022లో ఆర్‌సీబీ అదరగొడుతుంది. ఐపీఎల్ 15వ సీజన్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు (Royal Challengers Bangalore) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis Shines) (64 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మ్యాక్స్‌వెల్ (23), షాబాజ్ అహ్మద్ (26) ఫర్వాలేదనిపించారు.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగగా.. అనూజ్ రావత్ (4), ప్రభుదేశాయ్ (10) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో జాసెన్ హోల్డర్, దుష్మంత చమీర చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్ పాండ్యా 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కేఎల్ రాహుల్ 30, స్టోయినిస్ 24 పరుగులు చేశారు.
ఆర్‌సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, హర్షల్ పటేల్ 2, సిరాజ్, మ్యాక్స్‌వెల్ చెరొక ఒక వికెట్ తీశారు. డుప్లెసిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం జరుగనున్న పోరులో ఢిల్లీతో పంజాబ్ తలపడనుంది. లీగ్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది